
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Mahidhar Idupu Kayitham Controversy: సోషల్ మీడియాలో ఆంధ్ర-తెలంగాణ మధ్య కొత్తగా మరో వివాదం రాజుకుంది. 'ఇడుపు కాయితం' అనే సినిమా టైటిల్ తో మొదలైన ఈ రచ్చ, ప్రస్తుతం పీక్స్‌కి చేరింది. ఈ నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్, జబర్దస్త్ ఫేమ్ మహిధర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
"హైదరాబాదులో ఆంధ్ర వాళ్ళు తమ ఆస్తులు అమ్మేస్తే తెలంగాణ వాళ్లు కొనగలరా?" అంటూ మహీధర్ మాట్లాడిన ఒక పాత వీడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ కావడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వివాదంపై స్పందించిన యూట్యూబర్ మహిధర్.. తాజాగా మరో వీడియో విడుదల చేసి, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
తన మాటలు తెలంగాణ ప్రజలందరినీ ఉద్దేశించినవి కావని.. ఆంధ్ర తెలంగాణ గొడవలు జరిగినప్పుడు ఆంధ్ర వాళ్ళు వెళ్లిపోవాలి అంటూ కామెంట్లు చేసే కొందరిని మాత్రమే ఉద్దేశించి అన్నానని ఆయన స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు తప్పేనని ఒప్పుకుంటూ క్షమాపణలు చెప్పారు.
ఒకవేళ హైదరాబాద్‌లో తెలంగాణ వాళ్లు మాత్రమే ఉండాలి.. ఆంధ్ర వాళ్ళు ఉండకూడదు అనే గట్టిగా భావిస్తే.. సోషల్ మీడియాలో రచ్చ చేయడం మానేసి, తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి నోటీసులు తెచ్చుకోవాలంటే ఆయన సూచించారు. కొందరి తప్పులను మొత్తం రాష్ట్రానికి ఆపాదించడం సరికాదని, ఇలాంటి వివాదాలు వల్ల రెండు రాష్ట్రాల మధ్య దూరం పెరుగుతుందని మహిధర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత మహీధర్ తన వివాదాస్పద వీడియోను ప్రైవేట్ చేసినప్పటికీ.. దానికి సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. భావద్వేగాలకు లోనవ్వకుండా సమయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నటుడు నరేష్ స్పందన.. అదేవిధంగా టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ కూడా వివాదం పై స్పందించారు. తెలుగు మాండలికాలను గౌరవించాలని, అందరం తెలుగు వాళ్ళమేనని గొడవ సద్దుమణిగేలా చేయడానికి ప్రయత్నించినప్పటికీ.. రాజకీయ నాయకుల ప్రమేయంతో వివాదం మరింత పెద్దదయిందని నరేష్ అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.