
మేష రాశి : మేష రాశి వారికి చాలా విధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వీరికి జ్యేష్ఠ పూర్ణిమ అనేక ప్రయోజనాలు తీసుకొస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
ఎవరు అయితే చాలా రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, వారు వాటి నుంచి బయటపడి చాలా ఆనందంగా జీవిస్తారు.
సింహ రాశి : సింహ రాశి వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఆదాయం డబుల్ అవుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అంతే కాకుండా ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. చాలా రోజుల నుంచి స్థిరాస్తి కొనుగోలు చేయాలని ఎవరు అయితే ప్రయత్నాలు చేస్తున్నారో, వారికి ఇది మంచి సమయం. భూమి లేదా ఫ్లాట్ కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. అన్నివిధాలుగా చాలా అద్భుతంగా ఉంటుంది.
ధనస్సు రాశి :జ్యేష్ఠ పౌర్ణమి ధనస్సు రాశి వారికి శుభఫలితాలను తీసుకొస్తుంది. ఆదాయం పెరుగుతంది. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునే వారికి కూడా ఇది చాలా మంచి సమయం. ఈ పౌర్ణమి సమయంలో వీరికి అనుకూలత పెరిగి, అన్ని విధాలుగా కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేవారు తమ కోరికను నెరవేర్చుకుంటారు.
మకర రాశి : మకర రాశి వారికి ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి. బ్రహ్మయోగం వలన అన్నింట్లో శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుంది. ఇంట్లో సానుకూలత పెరుగుతుంది. అన్ని విధాలుగా వీరికి ఇవి మంచి రోజులు అని చెప్పాలి.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు