
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీకోసం ఒక అదిరిపోయే అప్డేట్ రాబోతోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన సర్వీసులను పూర్తిగా మార్చేయడానికి రెడీ అవుతోంది.
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీకోసం ఒక అదిరిపోయే అప్‌డేట్ రాబోతోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన సర్వీసులను పూర్తిగా మార్చేయడానికి రెడీ అవుతోంది. పాత పద్ధతులకు బైబై చెప్పేస్తూ, ఈపీఎఫ్ఓ 3.0 (EPFO 3.0) పేరుతో సరికొత్త డిజిటల్ సిస్టమ్‌ను తీసుకురానుంది. దీనివల్ల పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం (PF Withdrawals) మునుపటికంటే చాలా ఈజీ కాబోతుంది. కొన్ని కండిషన్లకు లోబడి, అవసరమైనప్పుడు మీ పీఎఫ్ బ్యాలెన్స్ నుంచి ఏకంగా 75 శాతం వరకు డబ్బును ఆన్‌లైన్‌లోనే చాలా వేగంగా విత్‌డ్రా చేసుకోవచ్చుటెక్నాలజీ పుణ్యమా అని అత్యవసర సమయాల్లో చేతికి డబ్బులు అంత స్పీడ్‌గా అందడం నిజంగా ఉద్యోగులకు పెద్ద వరమే. అయితే, ఇక్కడే ఒక చిన్న తిరకాసు కూడా ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. డబ్బులు తీయడం చాలా సులువు కదా అని అలవాటు పడితే.. భవిష్యత్తులో పెద్ద ఆర్థిక ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందంటున్నారు.వడ్డీ మీద వడ్డీ.. ఆ చక్రవడ్డీ లాభం దక్కదు!ఉద్యోగం చేసే రోజుల్లో వీలైనంత వరకు పీఎఫ్ డబ్బులను ముట్టుకోకుండా ఉండటమే మంచిదని నిపుణులు గట్టిగా సలహా ఇస్తున్నారు. ఎందుకంటే, పీఎఫ్ అకౌంట్‌లో జమ అయ్యే ప్రతి రూపాయికి వార్షిక చక్రవడ్డీ (Compounding) లభిస్తుంది. అంటే.. వడ్డీ మీద కూడా వడ్డీ పడుతూ కాలక్రమేణా అది ఒక పెద్ద కొండలాంటి నిధిగా మారుతుంది. ఒకవేళ మీరు చిన్న చిన్న అవసరాల కోసం మధ్యలోనే పీఎఫ్ డబ్బులు తీసేసుకుంటే, ఆ మొత్తంపై భవిష్యత్తులో వచ్చే వడ్డీ లాభాన్ని మీరు శాశ్వతంగా కోల్పోతారు. EPFO New Rules: జులై 1 నుంచి కనీస నిల్వ తప్పనిసరి!పీఎఫ్ అంటే అంతా ఒక్కటే అనుకుంటే పొరపాటే!చాలా మంది ఉద్యోగులు తాము ప్రతినెలా పొదుపు చేసే పీఎఫ్ డబ్బులన్నీ ఒకే అకౌంట్‌లోకి వెళ్తాయని అనుకుంటారు. కానీ అసలు విషయం అది కాదు. మీ జీతం నుంచి కట్ అయ్యే భాగం ఈపీఎఫ్ (EPF) అకౌంట్‌కు వెళ్తుంది. కానీ, కంపెనీ (యాజమాన్యం) జమ చేసే దాంట్లో కొంత శాతం ఈపీఎస్ (EPS - పెన్షన్ పథకం) కిందకు మళ్లుతుంది. ఒకవేళ మీరు మీ పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకున్నప్పటికీ.. ఈపీఎస్ ద్వారా వచ్చే మీ పెన్షన్‌కు ఎలాంటి ఢోకా ఉండదు. అయితే, ముసలితనంలో కేవలం పెన్షన్ డబ్బులు మాత్రమే జీవిత ఖర్చులకు సరిపోకపోవచ్చు. అందుకే రిటైర్మెంట్ లైఫ్‌కు పీఎఫ్ పొదుపే నిజమైన కొండంత అండ. PF డబ్బులు ఆగిపోయాయా.. అయితే ఈ కొత్త వెబ్ సైట్ మీ కోసమేపీఎఫ్ అకౌంట్.. మీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కాదు!ఈపీఎఫ్ఓ తీసుకువస్తున్న ఈ సరికొత్త డిజిటల్ వేదిక ఉద్దేశం.. నిజంగా ఆపదలో ఉన్నవారికి త్వరగా సహాయం అందించడమే. అంతేకానీ, దీన్ని రోజువారీ వాడుకునే సాధారణ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌లా భావించకూడదు. షాపింగ్‌ల కోసమో, విలాసవంతమైన ఖర్చుల కోసమో పీఎఫ్ నుంచి ముందే డబ్బులు తీసేస్తే.. చేజేతులా మీ రిటైర్మెంట్ జీవితాన్ని రిస్క్‌లో పడేసుకున్నట్లే అవుతుంది. మెడికల్ ఎమర్జెన్సీ లాంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తప్ప మిగిలిన సమయాల్లో ఈ డబ్బును అసలు ముట్టుకోవద్దు.ఈపీఎఫ్ఓ 3.0 తీసుకువస్తున్న ఈ ఫాస్ట్ సర్వీస్‌ను ఒక మంచి పరిణామంగానే చూడాలి. కాకపోతే, సులభంగా అందుబాటులో ఉందని అవసరం లేకున్నా ముందస్తు విత్‌డ్రాలు చేసుకోకండి. నేటి చిన్నపాటి ఆనందాల కంటే, రేపటి రిటైర్మెంట్ తర్వాత గౌరవంగా బతకడానికి అవసరమైన ఆర్థిక భద్రతకే ప్రతి ఉద్యోగి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.