
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేశారు. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియ భవానీ శంకర్ కథానాయిక.
ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేశారు. శివ నిర్వాణ, కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ‘ఇరుముడి కట్టు.. శబరిమల ఎక్కు..’ పాట ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది. అనంతు ఆలపించారు. బాబా భాస్కర్ కొరియోగ్రఫీ చేశారు.