
రచ్చ రవి .. అనే పేరు వినగానే 'జబర్దస్త్' గుర్తుకొస్తుంది. తనదైన డైలాగ్ డెలివరీ .. బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ తరువాత ఆయన సినిమాలలోను అవకాశాలను అందుకుంటూ ముందుకు వెళుతున్నారు
. కాకతీయ యూనివర్సిటీలో సైకాలజీ చేస్తున్న రచ్చ రవి, 'నీ రుణం తీరేదెట్లా?' అనే ఒక పుస్తకాన్ని రాశారు. ఆ సందర్భంగా ఆయన 'సిగ్నేచర్ స్టూడియో'కి ఇంటర్వ్యూ ఇచ్చారు. "ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం నాకు ఇష్టం. నేను ఇంకా ఏం చేయగలను .. ఏం నేర్చుకోగలను? అనే విషయాలను గురించి మాత్రమే ఆలోచన చేస్తాను. అనవసరమైన విషయాలను గురించి మాట్లాడుతూ సమయాన్ని వృథా చేయడం నాకు నచ్చదు. అందువలనే 'సింగ్ గీతం' సినిమా షూటింగ్ సమయంలో నాకు దొరికిన ఖాళీ సమయంలో నేను ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. నేను చూసిన కుటుంబ వ్యవస్థ .. ఇప్పటి కుటుంబ వ్యవస్థ గురించి నేను గ్రహించింది రాసుకొచ్చాను" అని ఆయన అన్నారు. "మా అమ్మమ్మ .. నాన్నమ్మలతో నాకు మరిచిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ రోజులు నాకు చాలా గొప్పగా అనిపిస్తాయి. ఈ తరం పిల్లలు .. వాళ్ల అమ్మమ్మలు - నాయనమ్మలు కూడా వేరే వ్యాపకాలతో బిజీగా ఉంటున్నారు. అమ్మమ్మలు - నాయనమ్మలను పట్టించుకోకుండా, చిన్న చిన్న పిల్లలతో పెద్ద పేద రీల్స్ చేయిస్తున్నారు. అదే నాకు బాధను కలిగిస్తూ ఉంటుంది. దేవుడు ప్రత్యక్షమైతే మా అమ్మమ్మ - నాయనమ్మలను ఇవ్వమనే అడుగుతాను. " నేను ఈ పుస్తకంలో ఈ కాలం నాటి పేరెంట్స్