టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ , విభిన్నమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తెరకెక్కించడంలో దిట్ట అయిన దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో ఒక సరికొత్త డివోషనల్ ఎండ్ ఎమోషనల్ డ్రామాగా ‘ఇరుముడి’ రూపొందుతున్న సంగతి...
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ , విభిన్నమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తెరకెక్కించడంలో దిట్ట అయిన దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో ఒక సరికొత్త డివోషనల్ ఎండ్ ఎమోషనల్ డ్రామాగా ‘ఇరుముడి’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయ్యప్ప స్వామి భక్తి, తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అపురూపమైన అనుబంధం నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం నుండి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన పాటను మేకర్స్ సోమవారం నాడు అత్యంత ఘనంగా విడుదల చేశారు. సోమవారం విడుదలైన ‘ఇరుముడి కట్టు’ (కట్టు కట్టు ఇరుముడి కట్టు) సాంగ్ యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పాటకు సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన ట్యూన్, హై-వోల్టేజ్ భక్తిభావం శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తోంది. ముఖ్యంగా అయ్యప్ప మాలధారుల డ్యాన్స్ స్టెప్స్, ఆ గూస్బంప్స్ తెప్పించే భక్తి సంగీతం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. స్వామియే శరణమయ్యప్ప అనే నామస్మరణతో సాగే ఈ గీతం వింటుంటేనే ఒళ్లు పులకరించేలా ఉంది. ఈ సినిమాలో ఈ ఒక్క పాటే కాకుండా ‘విల్లాలి వీరుడు’, ‘మల్లెపూల పల్లకి’ వంటి పాపులర్ భక్తి గీతాలు కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతున్నాయి. గుండెల్ని పిండేసే తండ్రీకూతుళ్ల కథఇప్పటికే ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’ పేరుతో విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించగా, ఈ సినిమా కథాంశం రవితేజ కెరీర్లోనే మైలురాయిగా నిలిచిపోనుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మద్యం వ్యసనానికి బానిసైన ఓ మధ్యతరగతి తండ్రి, ఆ అలవాటు వల్ల తన ప్రాణ సమానమైన కూతురికి దూరమయ్యే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత ఆ వ్యసనాన్ని విడిచిపెట్టి, తన బిడ్డ కోసం ఆయన అయ్యప్ప దీక్షను ఎలా స్వీకరించాడు? ఆ స్వామి అనుగ్రహంతో వారి జీవితం ఏ మలుపు తిరిగింది? అనే ఎమోషనల్ పాయింట్‌తో ఈ సినిమా నడవనుంది. రవితేజ మునుపెన్నడూ పోషించని ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా, అయ్యప్ప భక్తుడిగా ఈ చిత్రంలో కనిపించనున్నారు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తుండగా, రవితేజ కూతురి పాత్రలో బేబీ నక్షత్ర అలరించనుంది. అలాగే సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోమవారం విడుదలైన ఈ పాటతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటగా, ఈ వినూత్న భక్తిరస చిత్రం ఆగస్ట్ 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.