
సోషల్ మీడియాలో ఆంధ్రా-తెలంగాణ రచ్చ కొనసాగుతుంది. తాజాగా ఇడుపు కాయితం సినిమాతో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తీవ్రరూపం దాల్చాయి. ఇదే సమయంలో ప్రముఖ యూట్యూబర్ జబర్దస్త్ మహిధర్ తన వ్యాఖ్యలపై స్పందించారు.
హైదరాబాద్‌లో ఆంధ్రా వాళ్ళు తమ ఆస్తులు అమ్మితే తెలంగాణ వాళ్లు కొనగలరా అని అడిగిన వీడియో క్లిప్ వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆయన, తన మాటలను వెనక్కి తీసుకున్నారు.అందరినీ ఉద్దేశించిన వ్యాఖ్యలు కాదని మహీధర్ క్లారిటీ మహిధర్ తన కొత్త వీడియోలో వివరణ ఇస్తూ, ఆ మాటలు కేవలం కొందరిని ఉద్దేశించి చెప్పినవని, తెలంగాణలో ఉన్న అందరినీ ఉద్దేశించి కాదని స్పష్టం చేశారు. ఆంధ్రా-తెలంగాణ వివాదాలు తలెత్తినప్పుడు కొందరు ఆంధ్రా వాళ్ళను ఆంధ్రాకు వెళ్లిపోవాలని చెప్పడం సరికాదని, అలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఉద్దేశించి తాను స్పందించానని తెలిపారు. తన మాటలు తప్పని అంగీకరించి వెనక్కి తీసుకుంటున్నానని స్పష్టంగా చెప్పారు.హైదరాబాద్ లో తెలంగాణా వాళ్ళు మాత్రమే ఉండాలంటే ఇలా చెయ్యండి.. సూచన ఇక హైదరాబాద్‌లో ఆంధ్రా వాళ్ళు ఎక్కువగా ఉన్నారని, వారు వెళ్లిపోవాలని అనుకుంటే సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టకుండా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాలని మహిధర్ సూచించారు. హైదరాబాద్‌లో తెలంగాణ వాళ్లు మాత్రమే ఉండాలని, ఇతరులు ఉండొద్దని భావిస్తే న్యాయస్థానం ద్వారా నోటీసులు తీసుకొని చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. కొందరి తప్పులను మొత్తం రాష్ట్రానికి ఆపాదించడం సరికాదన్నారు.ఇలాంటి వివాదాలతో రెండు రాష్ట్రాల మధ్య దూరం పెరుగుతుందన్న మహీధర్ ఇలాంటి వివాదాలు రాష్ట్రాల మధ్య దూరం పెంచుతాయని హెచ్చరించారు. ఈ వివాదం ఇడుపు కాయితం టైటిల్ నుంచి మొదలై సోషల్ మీడియాలో పెద్ద రచ్చగా మారింది. నటుడు నరేష్ వంటి వ్యక్తులు తెలుగు మాండలికాలను గౌరవించాలని, అందరం తెలుగు వాళ్లమేనని చెప్పి గొడవ సద్దు మణగాలని ప్రయత్నం చేసినా, రాజకీయ నాయకుల వ్యాఖ్యలు వివాదాన్ని మరింత రగిల్చాయి.మహిళా స్వయం సహాయక సంఘాలకు త్వరలో రైస్ మిల్లులు.. శుభవార్త!మహీధర్ వ్యాఖ్యలు వైరల్.. ఇడుపుకాయితంతో మొదలైన రచ్చ ఇరు వైపులా నెటిజన్లు భావోద్వేగంతో స్పందిస్తున్నారని, సంయమనం పాటించాలని మహిధర్ విజ్ఞప్తి చేశారు. మహిధర్ తన అసలు వీడియోను ప్రైవేట్ చేసినా, ఆయన వ్యాఖ్యలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇడుపు కాయితం సినిమాపై మొదలైన ఆంధ్రా తెలంగాణా వార్ ఇప్పుడు పీక్స్ కు చేరుకుంది.