
ఇంటర్నెట్ డెస్క్: ఒక సినిమా విజయం సాధించడానికి ఎలాంటి ఫార్ములా ఉండదని బాలీవుడ్ అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) అన్నారు.
థియేటర్లలో సినిమా విజయవంతం కావాలంటే భారీ తారాగణం, అధిక బడ్జెట్, గ్రాండ్ ఈవెంట్స్ ఉండాలనే చర్చ జరుగుతోన్న వేళ అక్షయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ‘సైయారా’ (Saiyaara) విజయాన్ని ప్రస్తావించారు.
‘‘సైయారాకు ఎన్ని ఈవెంట్స్ జరిగాయి? అందులో ఎంతమంది స్టార్స్ ఉన్నారు..? ఆ సినిమా ఎలాంటి హడావుడి లేకుండా విడుదలైంది. అయినప్పటికీ అందులోని కథ, సంగీతం, రొమాన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఆ చిత్రంలోని హీరో హీరోయిన్లు చాలా బాగా నటించారు. ఆ సినిమా అంత పెద్ద విజయం సాధించడం వారి అదృష్టం. ‘ఇలా ఉంటేనే సినిమా హిట్ కొడుతుంది’ అని చెప్పేలా ఎలాంటి ఫార్ములాలు ఉండవు. ప్రేక్షకులకు నచ్చితే ఎలాంటి చిత్రమైనా హిట్ అవుతుంది. ఈ విషయాన్ని ‘సైయారా’ నిరూపించింది’’ అని అక్షయ్ కుమార్ అన్నారు.
అహాన్ పాండే, అనీత్ పడ్డా ప్రధానపాత్రల్లో మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన ‘సైయారా’ గతేడాది విడుదలై ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. భారీ ఫైట్స్, పవర్ఫుల్ డైలాగ్స్, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా కేవలం భావోద్వేగ కథాకథనాలతో ప్రేక్షకులను మెప్పించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.