Mutual Funds SIP Calculator: మనం పెట్టుబడులు పెట్టేందుకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. వీటిల్లో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి.
ఇక్కడ రిస్క్ ఉన్నప్పటికీ లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పొచ్చు. నిపుణులు కూడా ఇదే చెబుతుంటారు. మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్టాక్ మార్కెట్‌తో పోలిస్తే ఇంకాస్త భిన్నంగా ఉంటూ, కాస్త వైవిధ్యతతో కూడిన రిటర్న్స్ అందిస్తుంటాయి. రిస్క్ కూడా ఇక్కడ ఇంకాస్త తక్కువే ఉంటుంది. చాలా వరకు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందించినవే ఉన్నాయి. ఇక్కడ గత రిటర్న్స్ ఎలా ఉన్నాయో చూడటంతో పాటుగా ఆ స్కీమ్ మేనేజర్, ఏయే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది, సగటున ఎంత రాబడి ఇస్తుంది, అనిశ్చితి సమయంలో ఎలా పెర్ఫామ్ చేసింది వంటి వివరాలన్నీ తెలుసుకోవడం ముఖ్యం. ఇప్పుడు మనం ఇలా అద్భుత స్థాయిలో రిటర్న్స్ అందించిన ఒక మిడ్ క్యాప్ ఫండ్ గురించి చూద్దాం. ఇదే హెచ్డీఎఫ్సీ మిడ్ క్యాప్ ఫండ్. ఈ స్కీమ్ 2007 జూన్ 25న లాంఛ్ అవగా ఇప్పుడు 19 సంవత్సరాలు పూర్తి చేసుకుందని చెప్పొచ్చు. లాంఛింగ్ దగ్గరి నుంచి చూస్తే సగటున వార్షిక ప్రాతిపదికన ఇది 17.13 శాతం CAGR రిటర్న్స్ అందించింది. ఈ క్రమంలో బెంచ్‌మార్క్ ఇండెక్స్ పెర్ఫామెన్స్‌ను దాటేసింది. ఇప్పుడు 20 వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన హెచ్డీఎఫ్సీ మిడ్ క్యాప్ ఫండ్ నిర్వహణలోని ఆస్తుల విలువ (AUM) రూ. 1 లక్ష కోట్ల మార్కు దాటినట్లు హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎండీ, సీఈఓ నవ్‌నీత్ మునోత్ వెల్లడించారు. దీంతో మిడ్ క్యాప్‌లో అతిపెద్ద ఫండ్ కంపెనీల్లో ఒకటిగా నిలిచి ఘనత సాధించింది.రిటర్న్స్ పరంగా స్థిరంగా ఇన్వెస్టర్లకు ఇది మంచి రాబడి అందిస్తూ వస్తోంది. గత పదేళ్ల కాలంలో చూస్తే 17.95 శాతం CAGR రిటర్న్స్ ఇవ్వగా, ఐదేళ్లలో చూస్తే ఇది 20.20 శాతంగా ఉంది. ఇక పెట్టుబడి పరంగా చూస్తే నెలకు రూ. 10 వేల చొప్పున ఇందులో సిప్ పెట్టుబడి పెట్టిన వారికి లాంఛింగ్ దగ్గరి నుంచి 19 ఏళ్లలో రూ. 1.82 కోట్లు వచ్చాయి. ఇక్కడ సగటున వార్షికంగా 19.01 శాతం రాబడి వచ్చింది. ఇదే రూ. 10 వేల సిప్ పెట్టుబడిపై గత 10, 15 ఏళ్ల కాలంలో చూస్తే వరుసగా రూ. 32.44 లక్షలు, రూ. 88.26 లక్షలు వచ్చాయి. ఇదే సమయంలో లంప్ సమ్ పెట్టుబడులు అంటే ఒకేసారి రూ. 10 వేలు ఇన్వెస్ట్ చేసిన వారికి చూస్తే ఈ క్రమంలో 19 ఏళ్లలో రూ. 2 లక్షలు వచ్చాయి. పదేళ్ల వ్యవధిలో అయితే అదే రూ. 10 వేలకు రూ. 52,109 వచ్చింది. ఇప్పటికే హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్, హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కూడా AUM విషయంలో రూ. 1 లక్ష కోట్ల మార్కు దాటేశాయి. Disclaimer: పైన ఇచ్చింది కేవలం సమాచారంగానే పరిగణించాలి. పెట్టుబడికి సిఫార్సు కాదు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌కు లోబడి ఉంటాయి. కాబట్టి ఆర్థిక నిపుణుల నుంచి సలహాలు తీసుకోవడం మంచిది.