శ్రుతి రావడం లేదు అని ఇందు, రాజు కంగారు పడుతుంటారు. ఇంకా శ్రుతి రావడం లేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు.. హర్షకి వెళ్లిపోమని చెప్తా అని రేఖ అంటుంది. ఏ నీకు ఈ డీల్ క్యాన్సిల్ అవ్వాలని ఉందా?
ఏంటి అని రాజు కౌంటర్ వేస్తాడు. అలా ఏం లేదు.. హర్షకి ఏదో పని ఉందట.. మళ్లీ అది కాకపోతే మన మీద ఫైర్ అవుతాడు కదా.. అని అంటుంది రేఖ. ఏం కాదు.. శ్రుతి వస్తుంది.. అని రాజు అంటాడు. అదే టైంకి ఆటోలోంచి శ్రుతి దిగుతుంది. చూశావా? చెప్పినట్టుగానే వచ్చిందని రాజు అంటాడు. ఏం అయింది శ్రుతి గారు అని ఇందు అడుగుతుంది. దార్లో వస్తుంటే స్కూటీ పాడైపోయింది.. ఆటో వల్ల లేట్ అయింది.. ఫోన్ సైలెంట్లో ఉండటంతో చూసుకోలేదు.. అందుకే లేట్ అయింది మేడం అని ఇందుతో చెబుతుంది. సరే ముందు.. పదా.. అక్కడ వాళ్లంతా వెయిట్ చేస్తున్నారు అని అంటుంది ఇందు. శ్రుతి ఇక్కడ ఉంటే.. అక్కడ ఎవరున్నట్టు అని రేఖ లోలోపల అనుకుంటుంది. అలా మనసులో కాదు.. వాళ్లకి ఫోన్ చేసి కనుక్కోండి అంటూ రేఖకి రాజు కౌంటర్ వేస్తాడు.రేఖ ఆగ్రహం.. ఎక్కడ చచ్చార్రా.. ఏం చేస్తున్నార్రా అని రౌడీలకు ఫోన్ చేసి ఫైర్ అవుతుంది రేఖ. మీరు చెప్పిన ఆమెనే చూస్తున్నాం.. ఆమె ఇంటి ముందే ఉన్నాం మేడం అని వాళ్లు చెబుతారు. అది ఆల్రెడీ ఇక్కడకు వచ్చింది రా.. చవటల్లారా.. మిమ్మల్ని నమ్ముకున్నాను చూడు అది నా తప్పు అని రేఖ తిట్టేసి ఫోన్ పెట్టేస్తుంది. ఇక లక్కీ గాడు చీరలో వచ్చి ఆ రౌడీలకు నిమ్మరసం ఇస్తాడు.. ఇది సరిపోతుందా.. మజ్జిగ కూడా ఇవ్వాలా? మాతో పెట్టుకోకండిరా.. అని వార్నింగ్ ఇస్తాడు లక్కీ.కాంట్రాక్ట్ ఇచ్చిన హర్ష.. ఇందు చూపించిన డిజైన్స్‌లో హర్ష ఓ మెలిక పెడతాడు. ఇక్కడ స్టోన్ బాగా లేదు కదా అని అంటాడు హర్ష. ఇదే ఛాన్స్ అనుకుని ఇందుని తిడుతుంది రేఖ. ఇలా చేశావ్ ఏంటి ఇందు.. ఇలా అయితే ఎలా.. ఇప్పుడు హర్ష మన డీల్ వద్దనుకుంటాడేమో అని రేఖ అంటుంది. మేమంతా అనుకుని ఇలా డిజైన్ చేశాం.. ఆ స్టోన్ గురించి ఇందు మీకు వివరిస్తుందని రాజు అంటాడు. ఇక ఇందు వివరించిన తీరు చూసి హర్ష సంబరపడతాడు. అద్భుతం అని ఇందుని మెచ్చుకుంటాడు. ఇకపై మా కంపెనీ కాంట్రాక్ట్‌లు అన్నీ మీకే ఇస్తాం.. మూడు నెలల్లో ఈ డిజైన్స్‌లో నగలు చేయించి ఇవ్వండని హర్ష అంటాడు.ఎదురించిన శ్రుతి.. నేను చెప్పింది ఏంటి.. నువ్వు చేసింది.. ఏంటి.. నేనంటే భయం తగ్గిందా? అని శ్రుతికి వార్నింగ్ ఇస్తుంది రేఖ. నేను ఇందు మేడం కోసం ఏమైనా చేస్తాను.. నేను ఇలా ఉండటానికి కారణం రాజ్ కావ్య మేడంలు.. వారి కోసం నేను ఏదైనా చేస్తా.. మీకు భయపడను.. మీరు ఏమైనా చేసుకోండి.. వారి కోసం ప్రాణాలైనా ఇస్తాను అని శ్రుతి అంటుంది. ఆ మాటలకు ఇంకా రేఖకి కోపం వస్తుంది. ఎవరిని చూసుకుని నీకు ఇంత ధైర్యం..ఆ రాజ్ గాడేనా? అని అంటుంది రేఖ.ఏం చేస్తానో చూడు.. నేను చెప్పినా వినకుండా.. నువ్వు అనుకున్నది చేశావ్ కదా.. ఇప్పుడు నేను అనుకున్నది చేస్తాను.. నీకేం జరుగుతుందో కూడా నువ్వు ఊహించలేవు అని బెదిరించి వెళ్లిపోతుంది రేఖ. ఈ విషయాలన్నీ ఇందు వింటుంది. రేఖ ఆంటీ మిమ్మల్ని ఇలా చేసిందని ముందు నాకు చెప్పొచ్చు కదా అని శ్రుతితో ఇందు అంటుంది. నాకేం అయినా పర్లేదు మేడం.. మీరు మాత్రం ఎవ్వరి ముందు తలవంచకూడదు.. అని శ్రుతి అంటుంది. మీ అమ్మానాన్నల వల్లే ఈ రోజు ఇలా ఉన్నాను అని శ్రుతి అంటుంది. వారిలానే మీరు కూడా కంపెనీని డెవలప్ చేయాలని శ్రుతి అంటుంది.తృటిలో తప్పిన ప్రమాదం.. మరో వైపు చలపతి, లక్ష్మీ ఇద్దరూ కూడా తమ యజమాని పిలిచాడని భోజనం చేయడానికి ఇంటికి వస్తారు. వారి కూతురు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ పేరు చెబుతుంది. అందులోనే తమ కొడుకు కూడా పని చేస్తున్నాడని చలపతి చెబుతాడు. అలాంటి వారు ఎవ్వరూ లేరని ఆమె అంటుంది. మీకు కంపెనీ పేరు గుర్తుకు లేదేమో.. ఒకసారి ఇంటికి వెళ్లిన తరువాత మీ అబ్బాయిని అడగండని యజమాని అంటాడు. అంతలోనే ఆర్డర్ పట్టుకుని వెంకీ అక్కడకు వస్తాడు. అక్కడ అమ్మానాన్నాల్ని చూసి మాస్క్ పెట్టుకుంటాడు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుంటాడు వెంకీ.రెచ్చగొట్టిన శేషు.. అసలే ప్లాన్ ఫ్లాప్ అయిన మంటలో రేఖ ఉంటే.. పుండు మీద కారం చల్లినట్టుగా స్వీట్లు పంచుతుంటాడు శేషు. మనం సక్సెస్ ఫుల్‌గా ఫెయిల్ అయ్యాం.. అందుకే స్వీట్స్ పంచుతున్నా.. ఆఫీసులో మీ అవసరం లేకుండానే గెలిచేశారు.. స్టాఫ్ దృష్టిలో దేవుళ్లు అయ్యారు.. ఇక రేపో మాపో ఈ ఇంట్లో కూడా రేఖ అవసరం లేదని నిరూపిస్తారేమో అని శేషు అంటాడు. దీంతో భ్రమరం, రేఖ కోపంగా చూస్తారు. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. 🔹‘గుండెనిండా గుడిగంటలు’ టుడే ఎపిసోడ్: టైం చూసి దెబ్బ కొట్టిన బాలు.. అరుణ్ ఉద్యోగం ఊడుతుందా?.. సుందరి పెళ్లిలో రోహిణి ఖేల్ ఖతం