
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం తల్లికి వందనం నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ నెలలోనే తొలుత ఈ నిధుల విడుదల పైన ఆలోచన చేసారు. అయితే, కొన్ని సమస్యల కారణంగా వచ్చే నెలలో అమలు చేయాలని డిసైడ్ అయ్యారు
. వేసవి సెలవుల తరువాత బడులు తిరిగి ప్రారంభం కావటంతో.. ఇప్పుడు మెగా పేరెంట్స్ - టీచర్స్ మీటింగ్ తో పాటుగా తల్లికి వందనం నిధుల విడుదల పైన నిర్ణయం తీసుకున్నారు.ప్రభుత్వం తల్లికి వందనం నిధుల విడుదల పైన తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ సంవత్సరం వరుసగా రెండో ఏడాది పథకం నిధుల విడుదల పైన అధికారులు పూర్తి నివేదికలను సమర్పించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా.. నిధులు అందించాలని నిర్ణయించిన మేరకు లెక్కలు సిద్దం చేసారు. 2025లో పాఠశాలలు పునఃప్రారంభమైన జూన్‌ 12న పథకాన్ని అమలు చేశారు. ఈ ఏడాది వివిధ కారణాలతో వచ్చే నెల అమలుచేయాలని భావిస్తున్నారు. గతేడాది 67.27 లక్షల మందికి పథ కం వర్తించగా, ఈ ఏడాది ఆ సంఖ్య 68 లక్షలుగా గుర్తించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ విద్యార్థుల వరకు ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు. గతేడాది నిబంధనల ప్రకారమే ఈ సంవత్సరం కూడా పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ నిధులు వేర్వేరుగా అందుతాయి.కేబినెట్ ప్రక్షాళన లో కొత్త ఫార్ములా, వీరు అవుట్ - కొత్త గవర్నర్లుగా.. కీలక శాఖలు వీరికే..!!నిధులు విడుదల.. మెగా పేరెంట్స్..టీచర్స్ మీటింగ్కాగా, ఇందుకోసం సుమారుగా రూ.9వేల కోట్లు అవసరం కానున్నాయి. ప్రభుత్వం ఏడాదికి 67 క్షల మందికిపైగా పథకాన్ని అమలు చేస్తోంది. ఈ ఏడాది అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో జూలై 10న నగదు జమ చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. నిధులు జమ చేసే రోజే మెగా పేరెంట్స్ టీచర్ల మీటింగ్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యం. విద్యార్థుల చదువుపై తల్లిదండ్రు లకు అవగాహన కల్పించడంతో పాటు, పథకం లబ్ధిని నేరుగా వారికి వివరించనున్నారు. అదే విధంగా అనాథ పిల్లలకు తల్లికి వందనం నిధులు అందించటం పైన ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు సిద్దం చేసారు. ఇక.. ఈ నిధుల జమ పైన ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయనుంది.