
సూర్యుడు కర్కాటక రాశిలో అడుగుపెట్టడం మేష రాశివారికి చాలా అనుకూలంగా మారుతుంది. నెల రోజుల పాటు ఈ రాశులకు శుభ ఫలితాలు అందుతాయి. ఈ సమయంలో ఈ రాశివారి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.
ఎలాంటి సవాలు అయినా ఎదుర్కునే సామర్థ్యం పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా కలిసొస్తుంది. మంచి లాభాలు పొందుతారు.డబ్బు బాగా కలిసొస్తుంది.ఈ నెలలో శుభవార్త కూడా వింటారు.
సూర్యుడు కర్కాటక రాశిలో అడుగుపెట్టడం మకర రాశివారికి కూడా బాగా కలిసొస్తుంది. ఆర్థికంగా మంచి లాభాలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. మంచి లాభాలు అందుకుంటారు. సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి.
సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించడంతో.. సింహ రాశివారికి ఈ నెల చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆ ప్రయాణాలు కూడా కలిసొస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. ఆకస్మిక లాభాలు అందుకుంటారు.పలుకుబడి, పరిచయాలు పెరుగుతాయి.
సూర్యుడు రాశి మార్పు.. ధనుస్సు రాశివారికి చాలా అద్భుతంగా ఉంటుంది.ఆకస్మికంగా ఆర్థిక లాభాలు పొందుతారు. ఊహించని మార్గాల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవ,మర్యాదలు పెరుగుతాయి. అదృష్టం పెరుగుతుంది.
కన్య రాశి వారికి కూడా ఈ సూర్య సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆదాయం ఆకస్మికంగా పెరుగుతుంది. ఊహించని రీతిలో చేతికి డబ్బు చేతికి అందుతుంది. నెల రోజుల పాటు ఎలాంటి టెన్షన్స్ లేకుండా జీవితం ఆనందంగా మారుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి పురోగతి సాధిస్తారు.