
నిత్యం సినిమా షూటింగ్స్, సేవా కార్యక్రమాలతో బిజీగా ఉండే మెగాస్టార్ చిరంజీవి ఆదివారం సాయంత్రం కాస్త ఆటవిడుపు పొందారు.
నిత్యం సినిమా షూటింగ్స్, సేవా కార్యక్రమాలతో బిజీగా ఉండే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela) ఆదివారం సాయంత్రం కాస్త ఆటవిడుపు పొందారు. హైదరాబాద్ గచ్చీబౌలి (Gachibowli)లో గడిచిన వారం రోజులుగా జరుగుతున్న రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్) (Rugby Premier League) సీజన్-2లో పోటీలకు హజరై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)తో కలిసి ఈ మ్యాచ్‌ను వీక్షించారు.
గతేడాది రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్, ఈసారి మాత్రం పట్టు వదలకుండా పోరాడి కప్ కైవసం చేసుకోని చాంపియన్‌గా నిలిచింది. గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం జరిగిన తుదిపోరులో హైదరాబాద్ హీరోస్ (Hyderabad Heroes) జట్టు 41-17తో ముంబై డ్రీమర్స్ (Mumbai Dreamers)పై ఘన విజయం సాధించింది.
ఫైనల్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి ట్రోఫీలను బహూకరించగా.. సినీ నటుడు చిరంజీవి, ప్రముఖ బాలీవుడ నటుడు రగ్బీ ఇండియా ప్రెసిడెంట్ రాహుల్ బోస్ ఇరుజట్ల ఆటగాళ్లకు పతకాలను ప్రదానం చేశారు. విజేత హైదరాబాద్‌కు రూ. 45 లక్షలు, రన్నరప్ ముంబైకి రూ. 25 లక్షలు, మూడోస్థానంలో నిలిచిన బెంగళూరుకు రూ.15 లక్షలు ప్రైజ్‌మనీగా దక్కింది.
అంతకుముందు మూడో స్థానం కోసం జరిగిన పోరులో బెంగళూరు బ్రేవ్ హార్ట్స్ జట్టు 22-19తో చెన్నై బుల్స్‌పై గెలిచింది. ఇక ఇదిలాఉంటే సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవితో పాటు స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu), హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఫైనల్‌కు విచ్చేసి హైదరాబాద్ జట్టుకు మద్దతు తెలియజేశారు.