
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
France Plane Crash: ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మన దేశంలో గతేడాది అహ్మదాబాద్ విమాన ప్రమాదం మరువక ముందు ఎన్నో అనేక దేశాల్లో ఘోర విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఫ్రాన్స్‌లోని ఓ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న 11 మంది దుర్మరణం పాలైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. తూర్పు ఫ్రాన్స్‌కు చెందిన ఈ పౌర విమానం కొందరు స్కై డైవర్లతో ప్రయాణం చేస్తుండగా ఈ దుర్ఘటన జరగడం గమనార్హం.
ఈ విమానం తూర్పు ఫ్రాన్స్‌లోని ఒక పారాచూటిస్ట్ (స్కై డైవింగ్ స్కూల్) పాఠశాలకు చెందినదిగా అధికారులు గుర్తించారు. ఈ విమాన ప్రమాదంలో పైలట్‌తో పాటు విమానంలోని 10 మంది ప్రయాణికులు - ఐదుగురు విద్యార్థులు, ఐదుగురు శిక్షకులు మరణించినట్లు సమాచారం అందుతోంది.
స్థానిక కాలమానం (ఫ్రాన్స్) ప్రకారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నాన్సీ నగరానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని, స్థానికంగా ఉండే విలేకర్లు తెలియజేశారు. దీంతో అత్యవసర సేవల సిబ్బంది వెంటనే స్పందించారని, అధికారులు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను సేకరిస్తున్నారని వార్తా సంగ్రాహకులు చెప్పారు.
అయితే మరణించిన వారిలో ఐదుగురు స్కై డైవింగ్ ట్రైనర్స్‌తో పాటు ఐదుగురు స్టూడెంట్స్.. ఒక పైలట్ ఉన్నారని స్పష్టం అయ్యింది. అయితే ఈ ప్రమాదంలో లేదా మృతుల్లో సాధారణ ప్రయాణికులు ఎవరూ లేరని అధికారులు స్పష్టం చేశారు.
ఈ ఘటనకు గల కారణం వెంటనే స్పష్టంగా తెలియరాలేదు. విమానాశ్రయం వద్ద ఉన్న బాధితుల బంధువుల సంరక్షణ కోసం వైద్య, మానసిక బృందాలను మోహరించారు. ఒక సాంకేతిక దర్యాప్తును ప్రారంభించినట్లు నాన్సీ నగర డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమౌరీ లాకోట్ తెలిపారు.
అత్యవసర సేవల రాకపోకలకు వీలు కల్పించేందుకు, విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతానికి పోలీసులు ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. అలాగే ప్రమాదం వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టారు. ఫ్రెంచ్ అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నునెజ్, మధ్యాహ్నం తర్వాత ప్రమాద స్థలాన్ని సందర్శించనున్నారని ఆయన సిబ్బంది తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.