
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
NTR - Trivikram: జూనియర్ ఎన్టీఆర్.. చిన్నపుడు గుణశేఖర్ దర్శకత్వంలో అంతా చిన్నపిల్లలతో తెరకెక్కిన ‘రామాయణం’లో బాల రాముడిగా అలరించాడు. ఆ తర్వాత ‘యమదొంగ’ లో కాసేపు యంగ్ యమాగా కనిపించి అభిమానులను ఖుషీ చేశాడు. అంతేకాదు వాచకంలోను, పౌరాణిక సినిమాల్లో నందమూరి వారసుడిగా తనకు తిరుగులేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ పౌరాణిక సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు గత కొన్నేళ్లుగా వార్తలు వస్తున్నాయి.
గాడ్ ఆఫ్ వార్.. సుబ్రహ్మణ్య స్వామి జీవిత చరిత్ర నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘గాడ్ ఆఫ్ వార్’ అనే పేరు ప్రస్తుతానికి వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరో అయ్యాకా ఎన్టీఆర్ తొలిసారి చేస్తోన్న పౌరాణిక సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఈ రోజు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు ఇవ్వనున్నట్టు హారికా అండ్ హాసిని క్రియేషన్స్ వాళ్లు తెలిపారు.
వచ్చే యేడాది సెట్స్ పెకి ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ.. ఇప్పటికే త్రివిక్రమ్ ఈ సినిమాకు సంబంధించిన కథతో పాటు మాటలు, స్క్రీన్ ప్లే అన్ని పూర్తి చేశారు. అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత త్వరలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఇక జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి వచ్చే యేడాది చివరి కల్లా పూర్తి చేయనున్నట్టు సమాచారం.
ఇక ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అరవింద సమేత వీరరాఘవ’ తర్వాత రాబోతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో శివుడు, మహా విష్ణువు, బ్రహ్మ దేవుడు, ఇంద్రుడు, సహా పలు పాత్రలకు ప్రాధాన్యత ఉంది. వీటిని ఆయా ఇండస్ట్రీస్‌లో ఉన్న బడా హీరోలతో చేయించాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ సినిమాలో సుబ్రహ్మణ్య స్వామి దేవేరులైన వల్లి, దేవసేన పాత్రల కోసం ఏ హీరోయిన్ను సెలెక్ట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఈ రోజు ఇచ్చే అప్డేట్తో ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాపై క్లారిటీ రానుంది. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన నాలుగు నిమిషాల ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం వచ్చే యేడాది జూన్ 11న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.