శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండె జబ్బులు, పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం.
దీనికోసం ఈ వంటింటి పదార్థాలు డైట్లో చేర్చుకోవాలి. అవేంటో మయోక్లినిక్ అధ్యయనం ద్వారా తెలుసుకుందాం.
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను వేగంగా కరిగించడానికి సహాయపడుతుంది. అందుకే కొలెస్ట్రాల్ ఉన్నవారు రోజూ ఉదయం రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం చాలా మంచిది.
అల్లంలోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు ట్రైగ్లిజరాయిడ్స్తో పాటు చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ కరిగించడంలో సహాయపడతాయి. అందుకే మీ వంటల్లో ఈ అల్లం చేర్చుకోవడం చాలా అవసరం.
ఓట్స్‌లో బీటా గ్లూకాన్ అనే సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది స్పాంజ్ లాగా పనిచేసి పేగుల్లోని చెడు కొలెస్ట్రాల్‌ను శుభ్రం చేస్తుంది. తద్వారా మీ గుండెను కాపాడుతుంది.
బాదం, వాల్నట్స్, గుమ్మడి, చియా సీడ్స్ వంటి గింజల్లో పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, ప్లాంట్ స్టిరాల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పేగుల నుంచి చెడు కొలెస్ట్రాల్‌ను శోషించుకుని శుభ్రం చేస్తాయి.
గ్రీన్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ వంటి హెర్బల్ టీలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో వేగంగా పనిచేస్తాయి. మీ గుండెను హెల్తీగా ఉంచుతాయి.
కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు వంటి పప్పుల్లో సాల్యుబుల్ ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తక్కువగా తిన్నా కడుపు నిండినట్లుగా చేసి చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తాయి. గుండెను హెల్తీగా ఉంచుతాయి.
డార్క్ చాక్లెట్లలో 70 శాతం కంటే ఎక్కువగా కోకో ఉంటుంది. అలాగే వీటిలోని ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు రక్త నాళాలకు అంటుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను శుభ్రం చేయడంలో సహాయపడతాయి.
అవకాడో పండ్లలో మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, డైటరీ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో సహాయపడతాయి.