
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
AP Rain Alert: ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా ఉపరితల ద్రోణితో పాటు నైరుతి ఋతుపవనాలు ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వీటి ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని సూచించింది వాతావరణ శాఖ. మరోవైపు ఈదురు గాలులతో కూడిన వర్షపాతం నమో అయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. అటు రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
నిన్న విజయనగరం జిల్లా రాజంలో 5.2 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. అటు గుంటూరు జిల్లా కాకునూరులో 5.1 సెం.మీ, తాడేపల్లిలో 4.5 సెం.మీ, ఎన్టీఆర్ జిల్లా పలు చోట్ల 4.1 సెం.మీ, బాపట్ల జిల్లా భట్టిప్రోల్లో 3.9 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదయినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
ఎల్‌నినో ప్రభావంతో ఏపీ సహా దేశ వ్యాప్తంగా తక్కువ వర్షపాతం నమోదు అవుతుందని చెప్పినా.. సముద్ర తీర ప్రాంతాల్లో ద్రోణి కారణంగా కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. అంతేకాదు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది.
ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ యేడాది సగటు వర్షపాతం 50 రోజులకు తగ్గనున్నట్టు వాతవారణ శాఖ అధికారులు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.