
90లలో మర్మదేశం పేరుతో టీవీ ఛానళ్లలో ప్రసారమైన మర్మదేశం సీరియల్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.
90లలో మర్మదేశం పేరుతో టీవీ ఛానళ్లలో ప్రసారమైన మర్మదేశం (Marmadesam) సీరియల్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆల్‌టైం బెస్ట్ సీరియల్స్‌లో ఇప్పటికీ అది చెరగని ముద్ర లిఖించుకుంది. అయితే ఇప్పుడు ఈ మర్మదేశం సిరీస్‌లో భాగంగా తాజాగా తెలుగులో వీరభద్రుని రహస్యం (Veerabhadruni Rahasyam)పేరుతో సరికొత్త సిరీస్ రూపొంది స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఇటీవల ఇందుకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేయగా తాజాగా ఆదివారం అఫీసియల్ ట్రైలర్ విడుదల చేశారు.
నాటి మర్మదేశం సీరియల్ మాదిరిగానే అంతుబట్టని రహస్యాలు, మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ తెరకెక్కించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు రఘు కుంచే (Raghu Kunche), రాజన్న అనీ (Annie) కీలక పాత్రలో నటించగా భీమగాని శ్రీ వర్ధన్ రెడ్డి (Bheemagani Sri Vardhan Reddy) దర్వకత్వం వహించాడు. కాగా ఈ సిరీస్ మొత్తంగా 60 ఎపిసోడ్స్‌గా జీ5 (Zee 5) ఓటీటీలో జూలై 3 నుంచి స్ట్రీమింగ్ అవనుంది.