
సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి చిన్న పాత్రలే సినిమాలకు పెద్ద అస్సెట్‌గా మారుతుంటాయి. ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్టులు తమ క్యూట్ ఎక్స్ప్రెషన్స్, నటనతో స్క్రీన్ మీద పండించే మ్యాజిక్ థియేటర్లలో ప్రేక్షకులను...
సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి చిన్న పాత్రలే సినిమాలకు పెద్ద అస్సెట్‌గా మారుతుంటాయి. ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్టులు తమ క్యూట్ ఎక్స్ప్రెషన్స్, నటనతో స్క్రీన్ మీద పండించే మ్యాజిక్ థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి చిన్న పాత్రలే సినిమాలకు పెద్ద అస్సెట్‌గా మారుతుంటాయి. ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్టులు తమ క్యూట్ ఎక్స్ప్రెషన్స్, నటనతో స్క్రీన్ మీద పండించే మ్యాజిక్ థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ఏడాది వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో బుల్లిరాజు నటనకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. బూతుల విషయం పక్కన పెడితే.. సినిమాకు బుల్లిరాజు పాత్ర హైలైట్ గా నిలిచింది. ఆ పాత్రలో నటించి మెప్పించిన చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ (Revanth) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓవర్ నైట్ స్టార్ హీరో, హీరోయిన్ గా మారారు అన్న మాట వింటూనే ఉంటాం. రేవంత్ ఓవర్ నైట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మారాడు. ఈ సినిమా తరువాత మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు లాంటి సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకొని ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ చైల్డ్ యాక్టర్‌గా మారిపోయాడు.
ఇక ఈ బ్యాక్-టు-బ్యాక్ సక్సెస్‌ల తర్వాత రేవంత్ క్రేజ్ టాలీవుడ్లో ఏ రేంజ్‌కు చేరిందంటే రోజుకు దాదాపు రూ. 1 లక్ష రూపాయల వరకు రెమ్యునరేషన్ ఛార్జ్ చేసేంత.. అవును మీరు విన్నది నిజమే.. 30 రోజులు షూటింగ్ ఉంటే కనుక.. నెలకు రేవంత్ సంపాదన అక్షరాల 30 లక్షలు. ఈ విషయం తెలియడంతో నెటిజన్స్ నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఒక బాలనటుడికి ఈ స్థాయి డిమాండ్ మరియు రోజువారీ పారితోషికం దక్కడం ట్రేడ్ వర్గాల్లో సైతం ఆసక్తికర చర్చకు దారితీసింది. కేవలం రెమ్యునరేషన్ మాత్రమే కాదు, రేవంత్ చేతిలో ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న చిత్రంలో కూడా రేవంత్ ఒక కీలకమైన పాత్రను దక్కించుకున్నాడు. ఈ భారీ ఆఫర్ రేవంత్ కెరీర్‌కు మరో పెద్ద మైలురాయిగా మారబోతోందని అంటున్నారు.
వరుసగా పెద్ద పెద్ద బ్యానర్స్, స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేస్తుండటంతో, టాలీవుడ్లో ప్రస్తుతం అత్యధిక డిమాండ్ ఉన్న చైల్డ్ ఆర్టిస్టుల లిస్టులో రేవంత్ టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. చిన్న వయసులోనే తన అద్భుతమైన టైమింగ్, యాక్టింగ్ స్కిల్స్‌తో మేకర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్న బుల్లిరాజు, రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద చిత్రాల్లో భాగం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొంటున్న రేవంత్ ని చూసి కొందరు అభినందిస్తున్నారు. ఇండస్ట్రీలో ఏదీ శాశ్వతం కాదు. కొత్తగా ఇంకొకరు వచ్చారు అంటే.. ముందు వచ్చినవారు పాతబడినట్లే. అలా కొత్తవాళ్ళు వచ్చేలోపు.. వచ్చిన ఛాన్స్ ని వచ్చినట్లు లాగేసి నాలుగు రాళ్ళు వెనకేసుకుంటే.. సెటిల్ అయినట్టే. బుల్లిరాజు కూడా అదే పని చేస్తున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు.