
కొన్నిసార్లు సినిమాలో చిన్న పాత్ర చేసినప్పటికీ కొందరు యాక్టర్స్ వైరల్ అయిపోతుంటారు. మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. బుల్లిరాజు అలియాస్ రేవంత్..
Jun 28 2026 8:34 PM | Updated on Jun 28 2026 8:34 PM
కొన్నిసార్లు సినిమాలో చిన్న పాత్ర చేసినప్పటికీ కొందరు యాక్టర్స్ వైరల్ అయిపోతుంటారు. మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. బుల్లిరాజు అలియాస్ రేవంత్.. ఏ క్షణాన 'సంక్రాంతికి వస్తున్నాం' చేశాడో గానీ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అందుకు తగ్గట్లే తెలుగులో వరస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఇతడు తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.
(ఇదీ చదవండి: నిర్మాతతో టాలీవుడ్ హీరోయిన్ నిశ్చితార్థం)
'సంక్రాంతికి వస్తున్నాం' హిట్ తర్వాత చిరంజీవి 'మన శంకరవరప్రసాద్', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒకరాజు', సింగిల్ తదితర చిత్రాల్లో కనిపించిన బుల్లిరాజు.. అనిల్ రావిపూడి తీస్తున్న వెంకటేశ్-కల్యాణ్ రామ్ మూవీలోనూ అవకాశం అందుకున్నాడట. ఇప్పుడీ బాలనటుడు రోజుకు రూ.లక్ష పారితోషికం అందుకుంటున్నాడట. కేవలం సినిమాలే కాదు మాల్స్ ఓపెనింగ్, టీవీ షోలు, యాడ్స్ కూడా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా చానమిల్లి అనే ఊరికి చెందిన రేవంత్.. ప్రస్తుతం 6వ తరగతి చదువుతున్నాడు. ఓ వీడియో వల్ల వైరల్ అయిన ఇతడిని చూసిన అనిల్ రావిపూడి సినిమాలోకి తీసుకున్నాడు. అదే 'సంక్రాంతికి వస్తున్నాం'. ఇది రిలీజైన తర్వాత బుల్లిరాజుగా హీరో వెంకటేశ్ కంటే ఎక్కువ వైరల్ అయిపోయాడనే చెప్పొచ్చు.
(ఇదీ చదవండి: 'బాహుబలి ద టార్చ్ బేరర్' రివ్యూ.. 123 నిమిషాలు గూస్ బంప్స్)
టాలీవుడ్ హీరోయిన్ బేబీ షవర్ సెలబ్రేషన్ (ఫొటోలు)
'ప్రేమమ్' హీరోయిన్ గోల్టెన్ బ్యూటీ (ఫొటోలు)
ఒకప్పటి హీరోయిన్ మధుబాల.. ఖుష్బూ కూతురి పెళ్లిలో ఇలా (ఫొటోలు)
చీరలో సింగారించుకుని అందంగా అనసూయ (ఫొటోలు)
మా పైనే కేసులు పెడతారా.. టీడీపీ గుండాల దాడి పై అంబటి రాంబాబు ప్రెస్ మీట్
YSRCP నేతలపై హత్యాయత్నం.. శాంతిభద్రతలు అదుపు తప్పాయి
కేతన్ కేసులో రోజుకో ట్విస్ట్.. నిండు ప్రాణం తీసిన సియా మౌనం
రాకెట్ స్పీడ్ లో దూసుకెళ్లిన ఓలా ఎలక్ట్రిక్, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్స్ ..