
ఇంటర్నెట్‌డెస్క్: ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ (Ben Stokes) అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తన కెరీర్లో చివరిదని ప్రకటించాడు.
ఈ మ్యాచ్‌కు ముందు రిటైర్మెంట్ ప్రకటించిన స్టోక్స్.. ఆ వార్త ప్రపంచానికి తెలిసిన కొద్దిసేపటికే.. తన ఖాతాలో మరో వికెట్ వేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి బంతికే జాక్ ఫాక్స్ వికెట్ దక్కించుకున్నాడు.
లండన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బెన్‌స్టోక్స్ ఆడలేదు. ఆ తర్వాత ప్రస్తుతం నాటింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌కు సారథ్యం వహిస్తున్నాడు. మరో వారం రోజులే జట్టులో ఉంటానని అప్పుడే చెప్పినట్లు తెలుస్తోంది. రిటైర్మెంట్ ప్రకటించడానికి ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో స్టోక్స్ భావోద్వేగానికి గురయ్యాడు. ‘‘రిటైర్మెంట్ కారణాల గురించి తర్వాత చెప్పొచ్చు. కానీ, ఈ జట్టు కోసం నేను చాలాసార్లు కష్టపడ్డాను. ఇప్పుడు మరోసారి కష్టపడాల్సి ఉంది. మనం చాలా కష్టపడాలి. ఫలితం ఎలా ఉన్నా శక్తి వంచన లేకుండా పని చేశామన్న సంతృప్తితో మైదానం విడిచి రావాలి. అదే నా కోరిక’’ అంటూ మ్యాచ్ ప్రారంభానికి ముందు జట్టు సభ్యులతో బెన్‌స్టోక్స్ వ్యాఖ్యానించాడు. 15 ఏళ్లపాటు ఇంగ్లాండ్ జట్టుకు సేవలందించిన స్టోక్స్.. తన కెరీర్లో 122 టెస్టులు ఆడగా.. 44 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 114 అంతర్జాతీయ వన్డేలు, 43 టీ20లు ఆడాడు. 2022 టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్: టీజీ20 లీగ్ 2026లో కరీంనగర్ డైమండ్స్ బోణీ చేసింది. ఆదివారం ఉప్పల్ వేదికగా వరంగల్ వారియర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యఛేదనలో వరంగల్ 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది.