
విశాల్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న చిత్రం మకుటం నుంచి తాజాగా హుషారెత్తించే పాట రిలీజ్ చేశారు. కాస్త గ్యాప్ తర్వాత విశాల్ (Vishal) నటిస్తున్న చిత్రం మకుటం (Makuttam).
సూపర్ గుడ్ ఫిలిమ్స్ (Super good films) బ్యానర్‌పై 99వ చిత్రంగా ఆర్బీ చౌదరి (R.B Choudary) నిర్మిస్తున్నారు. అంజలి (Anjali), దుశారా విజయన్ (Dushara Vijayan) కథానాయికలు. విశాల్ ఫస్ట్ టైం అధికారికంగా సినిమాకు దర్శకత్వం వహాస్తుండడం విశేషం. అంతేగాక ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో నిర్మాత అర్బీ చౌదరి రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే.. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసకున్న ఈ చిత్రం త్వరలో థియేటర్లలో విడుదలకు ముస్తాబయింది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రచార కార్యక్రమాలు షురూ చేశారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన పాట, టీజర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేయగా తాజాగా నచ్చాకే వచ్చారా (Nachchaake Vachera Lyric Video) అంటూ సాగే ఓ హుషారైన పాటను విడుదల చేశారు. ఈ పాటకు భువనచంద్ర (Bhuvanachandra) సాహిత్యం అందించగా జీవీ ప్రకాశ్ కుమార్ (G V Prakash Kumar) సంగీతంలో ప్రభ బంగారిగళ్ళ (Prabha Bangarigalla) ఆలపించింది. పాట కూడా క్యాచీగా ఉండి జనంలోకి బాగానే చొచ్చుకెళ్లేలా ఉంది. ఇంకెందుకు ఆలస్యం మీపాటపై ఓ సారి మీ చెవి వేయండి మరి.