
ఇంగ్లండ్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. ఆ జట్టు దిగ్గజ ఆల్‌రౌండర్, ప్రస్తుత టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాడు.
ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీసే తన కెరీర్లో చివరిదని 35 ఏళ్ల స్టోక్స్ స్పష్టం చేశాడు. న్యూజిలాండ్ తో మూడో టెస్టు తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు వెల్లడించాడు. అతని నిర్ణయంతో ఇంగ్లండ్ క్రికెట్లో ఒక గొప్ప అధ్యాయానికి తెరపడినట్టయింది.ట్రెంట్ బ్రిడ్జ్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు, డ్రెస్సింగ్ రూమ్‌లో తన సహచరులకు ఈ విషయాన్ని స్టోక్స్ తెలియజేశాడు. ఈ సమయంలో అతను తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు విడుదల చేసిన ఒక వీడియోలో స్టోక్స్ మాట్లాడుతూ, "రిటైర్మెంట్కు కారణాలు తర్వాత వెల్లడిస్తాను. కానీ ఈ జట్టు కోసం, మీ కోసం, మన కంటే ముందు ఆడిన వారి కోసం ఎన్నో కఠినమైన సమయాలను ఎదుర్కొన్నాను. ఇప్పుడు చివరిసారిగా మరో కఠిన సవాలును స్వీకరించాల్సి ఉంది" అని అన్నాడు."రాబోయే రెండు రోజులు ప్రతి ఒక్కరూ పూర్తి నిబద్ధతతో ఆడాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. ఫలితంతో సంబంధం లేకుండా, ఈ జట్టు తన సర్వశక్తులు ఒడ్డిందని తెలిసి మైదానం వీడాలి. అది ఒక్కటే నాకు కావాలి. నా కోసం కాదు, జట్టు కోసం అందరూ కష్టపడండి. భావోద్వేగాలను నేను అదుపు చేసుకున్నాను. ఇక పని ప్రారంభించాల్సిన సమయం వచ్చింది. దయచేసి అందరూ నాతో