
రామమందిర నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టైన ఇద్దరు ప్రధాన నిందితుల లైఫ్ స్టైల్ ఇటీవల కాలంలో చాలా మారిపోయినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇంటర్నెట్ డెస్క్: అయోధ్య రామమంది
రం నిధుల దుర్వినియోగం కేసులో ఒకే కుటుంబానికి చెందిన అనుకల్ప్ మిశ్రా, లవ్కుష్ మిశ్రా పాత్రలపై ప్రస్తుతం పోలీసులు దృష్టిసారించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఈ ఇద్దరితో పాటు మరో ఆరుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలకంగా ఉన్న ఇద్దరు మిశ్రాల లైఫ్ స్టైల్ ఇటీవల కాలంలో చాలా మారిపోయిందని ఇరుగుపొరుగు వారు చెప్పినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నగదు లెక్కింపు బాధ్యతలు తీసుకున్న అనుకల్ప్ ఆ తరువాత తన బంధువు లవ్కుష్ మిశ్రాను కూడా తన బృందంలో చేర్చుకున్నాడు. ఈ మోసానికి అనుకల్ప్ మాస్టర్‌మైండ్ అయ్యే అవకాశం ఉందని మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, అయోధ్యలోని బసవ గ్రామంలోగల అనుకల్ప్ ఇల్లు ఆ గ్రామంలో అత్యంత విలాసవంతమైనదని తెలుస్తోంది. కొంత కాలం క్రితమే ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొందని గ్రామస్థులు తెలిపారు. అనుకల్ప్ మిశ్రా ఏప్రిల్ 30న తన గ్రామంలో ఏడు రోజుల పాటు ఒక మతపరమైన వేడుక నిర్వహించాడని అతడి తాతయ్య తెలిపారు. కార్యక్రమంలో అనుకల్ప్తో పాటు రామ మందిర ట్రస్టు మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, అయోధ్య మేయర్ కూడా పాల్గొన్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో అంత భారీ ఈవెంట్‌కు అనుకల్ప్ నిధులు ఎలా సమకూర్చాడని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. అనుకల్ప్ ఈ మధ్యనే గ్రామశివారులో ఒక ఫార్మ్ హౌస్ కూడా కొనుగోలు చేశాడని గ్రామస్థులు చెబుతున్నారు. స్కార్పియో ఎస్యూవీ కొనేందుకు కూడా అనుకల్ప్ సిద్ధమైనట్టు తెలిపారు.
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, అనుకల్ప్ ఒకప్పుడు ఒక బ్యాంక్ ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా ఉండేవాడు. మూడేళ్ల క్రితం రామమందిర నిధుల లెక్కింపు బృందంలో చేరాడు. ఆ తరువాత తన బంధువైన లవ్కుష్ మిశ్రాను కూడా తన టీమ్‌లో చేర్పించుకున్నాడు. అద్దె ఇంట్లో ఉండే లవ్కుష్ మిశ్రా ఇటీవల కాలంలో లక్షకు పైగా ఖరీదు చేసే ఒక బైక్ కొన్నట్టు ఇరుగుపొరుగు వారు చెప్పారు. ఈ నేపథ్యంలో నిందితుల ఆర్థిక స్థితిగతులపై కూడా పోలీసులు దృష్టిసారించారు. ఈ కేసులో నిందితులగా ఉన్న వారి వ్యక్తిగత సంపద ఇటీవల కాలంలో బాగా పెరిగినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కొందరి సంపద ఏకంగా 100 రెట్లు పెరిగినట్టు కూడా తెలిసింది. ఖరీదైన ఆస్తులు, ప్లాట్లు, హోటళ్లను నిందితులు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాలపై ప్రస్తుతం సిట్ దర్యాప్తు చేస్తోంది.
కేతన్ మర్డర్ కేసు.. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు
నా పిలుపునకు స్పందించిన మీ అందరికీ ధన్యవాదాలు: ప్రధాని మోదీ