
ప్రముఖ దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన అనుభవాలు, తీసుకున్న కీలక నిర్ణయాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి పంచుకున్నారు.
ఓ హీరోతో తనకున్న అనుబంధం, యమలీల చిత్ర విశేషాలు, బాలీవుడ్ రీమేక్‌లు, రాబోయే అంతర్జాతీయ ప్రాజెక్ట్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించాయి. నటుడు రాజేంద్ర ప్రసాద్‌తో తన సంబంధం గురించి మాట్లాడుతూ.. మాయలోడు సినిమా సమయంలో తమ మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చాయని, అయితే అవి పెద్దవి కాదని, రాజేంద్ర ప్రసాద్ చాలా మంచి వ్యక్తి అని కృష్ణారెడ్డి వివరించారు. ఆ చిన్న గ్యాప్ తర్వాత తాము కలిసి పనిచేయలేదని, అయితే సరదాగా ఒక సినిమా చేసినప్పుడు ఆయన చేయడానికి సిద్ధపడ్డారని గుర్తు చేసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ మంచి మనిషి అయినా, చిన్నపాటి ఇగో ఉంటుందని, బతిమాలుకుని చేయించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : ఇది కదా సినిమా అంటే..! రూ.32 కోట్లు పెడితే ఏకంగా రూ.456కోట్లు వసూల్ చేసింది.. ఓటీటీలోనూ తోపే యమలీల సినిమాకు అలీని హీరోగా ఎంపిక చేయడం అప్పటికి ఒక సాహసోపేత నిర్ణయమని కృష్ణారెడ్డి తెలిపారు. పెద్ద హీరోలు తమతో సినిమా చేస్తామని చెప్పినా, అలీతోనే ఆ సినిమాకు న్యాయం జరుగుతుందని బలంగా నమ్మినట్లు వెల్లడించారు. ఈ విషయంలో సౌందర్య మొదట సంశయించి, అలీ పక్కన చేయనని చెప్పారని, దీంతో తాను ఇంద్రజను ఎంపిక చేశానని వివరించారు. అయితే, సౌందర్య తన తప్పును తెలుసుకొని, తర్వాత శుభలగ్నం సినిమాకు ఫోన్ చేసి అవకాశం ఇవ్వమని కోరిందని, బాబు మోహన్ పక్కన పాటలో నటించడానికి కూడా సిద్ధపడిందని కృష్ణారెడ్డి గుర్తుచేసుకున్నారు.
ఇది కూడా చదవండి : ఏం లిరిక్స్ భయ్యా..! కుర్రాళ్లు కన్నీళ్లు పెట్టేలా చేసిన సాంగ్.. చాలా మంది ఫేవరెట్ పాట పెద్ద హీరోలు తమ కథలను మార్చమని కోరతారని, చిన్న నటులతో పనిచేయడం వల్ల కథకు పూర్తి న్యాయం చేయవచ్చని, ఇది తన అనుభవమని పేర్కొన్నారు. కోట శ్రీనివాసరావు కూడా మొదట నిరాకరించగా, భరణిని తీసుకున్నట్లు తెలిపారు. కృష్ణారెడ్డి తీసిన అనేక విజయవంతమైన చిత్రాలు బాలీవుడ్లో రీమేక్ అయ్యాయి. శుభలగ్నం చిత్రం అనిల్ కపూర్, శ్రీదేవి నటించిన జుదాయిగా, అలాగే నో ఎంట్రీ వంటి చిత్రాలు కూడా తన కథలతోనే తెరకెక్కి ఘన విజయం సాధించాయని తెలిపారు. అప్పట్లో తన బిజీ షెడ్యూల్ కారణంగా ఆ రీమేక్‌లను తానే దర్శకత్వం వహించలేకపోయానని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : ఒక్క సినిమా కూడా చేయలేదు.. కానీ స్టార్ హీరోయిన్స్‌కు మించి క్రేజ్.. కుర్రాళ్లు పడిచచ్చిపోతారు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి