
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
CIBIL Score: లోన్ ఏదైనా సరే బ్యాంకుకు వెళ్లాల్సిందే. అది ఇల్లు కొనాలన్నా.. కారు కొనాలన్నా.. పిల్లలకు ఎడ్యుకేషన్ లోన్ కావాలన్నా.. బ్యాంకులో లోన్ కోసం వెళ్తుంటారు. కానీ భవిష్యత్తులో లోన్ పొందడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మీ సిబిల్ స్కోర్ 730కంటే తక్కువగా ఉంటే.. లోన్ పొందేందుకు మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ నిబంధనల్లో భారీ మార్పులు తీసుకురాబోతోంది. ఈ కొత్త రూల్స్ తర్వాత బ్యాంకులు ఎవరికైనా లోన్స్ ఇచ్చేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అత్యంత జాగ్రత్తలు తీసుకుంటాయి.
ఈ భారీ మార్పును ఎక్స్ పెక్టెడ్ క్రెడిట్ లాస్ ఫ్రేమ్ వర్క్ అని పిలుస్తారు. ఈ కొత్త రూల్ ఆర్బిఐ ఏప్రిల్ 1, 2027 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురాబోతోంది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత బ్యాంకులు ఇచ్చే లోన్స్ తోపాటు కస్టమర్లను పరిశీలించే విధానం పూర్తిగా మారిపోతుంది. బ్యాంకింగ్ వ్యవస్థను మరింత సురక్షితంగా, బలంగా మార్చాలన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వంతోపాటు ఆర్భిఐ ఈ చర్య తీసుకుంటోంది. అయితే ఈ చర్య లోన్స్ కోసం దరఖాస్తు చేసుకునే లక్షలాది మందిపై నేరుగా ప్రభావం చూపుతుంది.
ECL అంటే వినియోగదారుడు చాలా కాలం పాటు ఈఎంఐలు చెల్లించడం మానేసి.. ఆ ఖాతా నిరర్థక ఆస్తి (NPA)గా మారేంత వరకు బ్యాంకులు ఒక రుణాన్ని పూర్తిగా మొండి బకాయిగా పరిగణించవు. అయితే ఈ కొత్త ఈసీఎల్ విధానం ఈ మొత్తం పద్ధతిని పూర్తిగా మార్చేస్తుంది. రుణాలు డిఫాల్ట్ అయ్యే వరకు బ్యాంకులు ఇకపై వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. కొత్త నియమం ప్రకారం, ఏ రుణాలు డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉందో బ్యాంకులు ముందుగానే అంచనా వేసి, దానికి అనుగుణంగా ముందుగానే నిధులను రిజర్వ్ చేసుకోవాలి. సులభంగా చెప్పాలంటే, బ్యాంకులు ఇప్పుడు నష్టభయాలను ముందుగానే అంచనా వేస్తాయి.
తక్కువ సిబిల్ స్కోరు ఉన్నవారిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది:
ఈ కొత్త రూల్ మీ సిబిల్ స్కోర్ పై ఉంటుంది. ఒక వ్యక్తి లోన్ తీసుకునే ముందు ఆ వ్యక్తి సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్ ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరిస్తాయి. తక్కువ క్రెడిట్ స్కోర్లు, ట్రాక్ రికార్డులు సరిగ్గా లేనివారి లోన్ ఫైల్స్ మరింత నిశితంగా పరిశీలిస్తారు. ఇలాంటి వారికి బ్యాంకులు చాలా తక్కువ వడ్డీకే లోన్స్ అందిస్తాయి. లేదంటే లోన్ ఇవ్వాలంటే ఏదైనా ష్యూరిటీ కోరుతాయి. దేశంలో లోన్ కోసం అప్లయ్ చేసుకునేవారిలో ఎక్కువ మంది తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారే ఉంటారు. ఒక రిపోర్టు ప్రకారం దేశంలో లోన్ కోసం దరఖాస్తు చేసుకునేవారిలో సుమారు 62శాతం నుంచి 730 కంటే తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారే ఉన్నారు. ఇలాంటి వ్యక్తులకు భవిష్యత్తులో ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
2027లో లేదా ఆ తర్వాత లోన్ పొందడంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోకూడదనుకుంటే.. మీరు ఈ రోజు నుంచే మీ ఆర్థిక అలవాట్లను మెరుగుపరచుకోవాలి. మీ సిబిల్ స్కోర్‌ను మెరుగుపరచుకోవడం చాలా కీలకమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మీ చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని ఈఎంఐలను సకాలంలో చెల్లించండి. మీ క్రెడిట్ కార్డ్ బిల్లులను గడువు తేదీకి ముందే చెల్లించండి. మీ స్థోమతకు మించి అప్పు చేయకూడదు. ఈ రోజు మీరు చేసే ఈ చిన్న తప్పులు.. భవిష్యత్తులో పెద్ద లోన్స్ ను రిజక్ట్ చేసే అవకాశం ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.