
అక్కినేని అఖిల్(akkineni akhil), భాగ్యశ్రీ బోర్సే(Bhagyasri Borse) జంటగా నటిస్తున్న లెనిన్(Lenin) సినిమా రలీజ్ కు సమయం దగ్గరపడుతున్నా ఇప్పటివరకు ప్రచార కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో ప్రారంభం...
అక్కినేని అఖిల్(akkineni akhil), భాగ్యశ్రీ బోర్సే(Bhagyasri Borse) జంటగా నటిస్తున్న లెనిన్(Lenin) సినిమా రలీజ్ కు సమయం దగ్గరపడుతున్నా ఇప్పటివరకు ప్రచార కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో ప్రారంభం కాకపోవడం అభిమానుల్లో అసంతృప్తిని కలిగించింది. మురళీ కిషోర్ అబ్బూరి(Murali kishore abburi) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై మొదటి నుంచే మంచి అంచనాలు ఉన్నప్పటికీ, రిలీజ్ డేట్ సమీపిస్తున్న వేళ కూడా మేకర్స్ సైలెంట్‌గా ఉండటంపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమా జులై 10న థియేటర్లలో విడుదల కానుండటంతో ఇక ప్రమోషన్స్‌ను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో అభిమానులకు ఊరటనిచ్చే అప్డేట్ బయటకు వచ్చింది. లెనిన్ ట్రైలర్‌ను జూన్ 30న రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటివరకు టీజర్, పోస్టర్లతో మాత్రమే పరిమితమైన ప్రచారాన్ని ట్రైలర్‌తో ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమాలోని కథ, ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్‌ను ట్రైలర్లో హైలైట్ చేస్తూ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి పెంచేలా కట్ రెడీ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ట్రైలర్ తర్వాత వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు, ఈవెంట్లు, సోషల్ మీడియా క్యాంపెయిన్లతో ప్రమోషన్స్‌ను దూకుడుగా కొనసాగించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోందని సమాచారం. అఖిల్‌కు ఈ సినిమా కెరీర్ పరంగా ఎంతో కీలకంగా మారడంతో ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే ప్రస్తుతం ఉన్న అంచనాలు మరింత పెరగడంతో పాటు, జులై 10న లెనిన్ కు బలమైన ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.