
ఐర్లాండ్‌తో రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఫలితంగా బెల్ఫాస్ట్ వేదికగా ఐరిష్ జట్టు మరోసారి తొలుత బ్యాటింగ్‌కు దిగింది.
Jun 28 2026 5:33 PM | Updated on Jun 28 2026 6:18 PM
ఐర్లాండ్‌తో రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఫలితంగా బెల్ఫాస్ట్ వేదికగా ఐరిష్ జట్టు మరోసారి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అప్డేట్స్
రెండో వికెట్ కోల్పోయిన ఐర్లాండ్ 2.2: అర్ష్‌దీప్ బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన రాస్ అడైర్ (7 బంతుల్లో 16). కెప్టెన్ లోర్కాన్ టక్కర్ క్రీజులోకి వచ్చాడు. ఐర్లాండ్ స్కోరు: 26-2(3). టక్కర్ 1, హ్యారీ టెక్టార్ 4 పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ఐర్లాండ్ 1.5: హర్షిత్ రాణా బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ఇచ్చి పెవిలియన్ చేరిన టిమ్ టెక్టార్ (6 బంతుల్లో 5). హ్యారీ టెక్టార్ క్రీజులోకి వచ్చాడు.
ఇద్దరి అరంగేట్రం ఈ మ్యాచ్ సందర్భంగా తమ జట్టు తరఫున సూర్యాంశ్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్ (టీ20) అరంగేట్రం చేస్తున్నట్లు టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. సూర్యాంశ్ ఐపీఎల్లో సత్తా చాటాడని.. అతడి ఆట తీరుపై తమకు నమ్మకం ఉందని పేర్కొన్నాడు. అయితే, చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీకి మాత్రం మరోసారి మొండిచేయి ఎదురైంది.
తొలి టీ20లో విఫలమైన వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ కృష్ణపై వేటు పడింది. వారిద్దరి స్థానాల్లో సూర్యాంశ్, ప్రిన్స్ యాదవ్ తుదిజట్టులోకి వచ్చారు. అయితే, ఐర్లాండ్ మాత్రం తొలి టీ20లో టీమిండియాపై గెలుపొందిన జట్టునే కొనసాగించింది. కాగా బెల్ఫాస్ట్ వేదికగా తొలి టీ20లో ఆతిథ్య ఐర్లాండ్ టీమిండియాను 34 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా తొలిసారి భారత జట్టుపై గెలుపు నమోదు చేసింది.
తుదిజట్లు టీమిండియా అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.
ఐర్లాండ్ టిమ్ టెక్టర్, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్(కెప్టెన్, వికెట్ కీపర్), బెంజమిన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, లియామ్ మెక్‌కార్తీ, మాథ్యూ హంఫ్రీస్, జై ముంద్రా, మాథ్యూ హోలార్డ్.
టాలీవుడ్ హీరోయిన్ బేబీ షవర్ సెలబ్రేషన్ (ఫొటోలు)
'ప్రేమమ్' హీరోయిన్ గోల్టెన్ బ్యూటీ (ఫొటోలు)
ఒకప్పటి హీరోయిన్ మధుబాల.. ఖుష్బూ కూతురి పెళ్లిలో ఇలా (ఫొటోలు)
చీరలో సింగారించుకుని అందంగా అనసూయ (ఫొటోలు)
మా పైనే కేసులు పెడతారా.. టీడీపీ గుండాల దాడి పై అంబటి రాంబాబు ప్రెస్ మీట్
YSRCP నేతలపై హత్యాయత్నం.. శాంతిభద్రతలు అదుపు తప్పాయి
కేతన్ కేసులో రోజుకో ట్విస్ట్.. నిండు ప్రాణం తీసిన సియా మౌనం
రాకెట్ స్పీడ్ లో దూసుకెళ్లిన ఓలా ఎలక్ట్రిక్, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్స్ ..