
రెనాల్ట్ తన ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ అయిన అప్డేటెడ్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌ను జూలై 3న భారతదేశంలో విడుదల చేయనుంది. దశాబ్దానికి పైగా దేశంలో అమ్ముడవుతున్న క్విడ్ కారు కంపెనీకి చెంది
Jun 28 2026 6:00 PM | Updated on Jun 28 2026 6:07 PM
రెనాల్ట్ తన ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ అయిన అప్డేటెడ్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌ను జూలై 3న భారతదేశంలో విడుదల చేయనుంది. దశాబ్దానికి పైగా దేశంలో అమ్ముడవుతున్న క్విడ్ కారు కంపెనీకి చెందిన పాపులర్ మోడల్‌గా కొనసాగుతూ, దాని లైనప్‌లో కీలక పాత్ర పోషిస్తుంది.
క్విడ్ ఫేస్‌లిఫ్ట్ కారుకు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే.. ఇటీవల టెస్టింగ్ సమయంలో కనిపించిన స్పై షాట్లు ఫేస్‌లిఫ్ట్ క్విడ్ పూర్తిస్థాయి రీడిజైన్‌కు బదులుగా సూక్ష్మమైన స్టైలింగ్ మార్పులను పొందుతుందని సూచిస్తున్నాయి. వెహికల్ ముందు భాగం, రెనాల్ట్ బ్యాడ్జ్, టెయిల్ ల్యాంప్‌ల చుట్టూ క్యామోఫ్లాజ్‌తో కనిపించాయి. కాబట్టి ఇది కీలకమైన విజువల్ ఎలిమెంట్స్‌లో అప్డేట్లను సూచిస్తుంది.
అప్డేటెడ్ మోడల్లో కొత్త గ్రిల్, బంపర్లు, కొత్త లైటింగ్ అంశాలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ డిజైన్ డాసియా స్ప్రింగ్ ఈవీ నుంచి ప్రేరణ పొందవచ్చని, తద్వారా క్విడ్‌ను.. రెనాల్ట్ అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్‌కు అనుగుణంగా మార్చవచ్చని కూడా నివేదికలు సూచిస్తున్నాయి.
లోపలి భాగంలో.. మొత్తం క్యాబిన్ అనుభవాన్ని మెరుగుపరచడానికి క్విడ్ ఫేస్‌లిఫ్ట్ కొన్ని చిన్న అప్డేట్లను పొందుతుందని సమాచారం. అధికారిక ఫీచర్ల జాబితా ఏదీ వెల్లడించనప్పటికీ, అప్డేటెడ్ మోడల్లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లభించే అవకాశం ఉంది.
ఇంజిన్ పరంగా.. క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. ఇది ప్రస్తుతం ఉన్న 1.0-లీటర్, త్రీ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తోనే కొనసాగుతుందని భావిస్తున్నారు. ఈ ఇంజిన్ 65 bhp పవర్, 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఆప్షన్లు కూడా అలాగే ఉంటాయని అంచనా వేస్తున్నారు, కొనుగోలుదారులు 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 5 స్పీడ్ AMT మధ్య ఎంచుకోవచ్చు.
కంపెనీ ఈ కారు ధరలను లాంచ్ సమయంలో వెల్లడించనుంది. ఇది ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మారుతి సుజుకి ఆల్టో కె10, మారుతి సుజుకి సెలెరియో వంటి ప్రత్యర్థులతో పోటీని కొనసాగించనున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: E100 ఇంధనం.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన!
టాలీవుడ్ హీరోయిన్ బేబీ షవర్ సెలబ్రేషన్ (ఫొటోలు)
'ప్రేమమ్' హీరోయిన్ గోల్టెన్ బ్యూటీ (ఫొటోలు)
ఒకప్పటి హీరోయిన్ మధుబాల.. ఖుష్బూ కూతురి పెళ్లిలో ఇలా (ఫొటోలు)
చీరలో సింగారించుకుని అందంగా అనసూయ (ఫొటోలు)
మా పైనే కేసులు పెడతారా.. టీడీపీ గుండాల దాడి పై అంబటి రాంబాబు ప్రెస్ మీట్
YSRCP నేతలపై హత్యాయత్నం.. శాంతిభద్రతలు అదుపు తప్పాయి
కేతన్ కేసులో రోజుకో ట్విస్ట్.. నిండు ప్రాణం తీసిన సియా మౌనం
రాకెట్ స్పీడ్ లో దూసుకెళ్లిన ఓలా ఎలక్ట్రిక్, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్స్ ..