
రాజమహేంద్రవరంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి నగరం తడిచి ముద్దయింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.
రైల్వే స్టేషన్ రోడ్డు, శ్యామల సెంటర్, కోటిపల్లి బస్టాండ్, డీలక్స్ సెంటర్, హైటెక్ బస్టాండ్, ఆదాయ పన్ను కార్యాలయం రోడ్డు, కంబాల చెరువు, కోరుకొండ రోడ్డు తదితర ప్రాంతాల్లో కాలువలు పొంగి రహదారిపైకి వాన నీరు చేరింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వార్త చదివారా: మత్స్యకార గ్రామాలను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తాం: మంత్రి అనిత