
ధీరజ్, ఎస్కేఎన్, బన్నీ వాసు, వంశీ, శరత్.. గీతా ఆర్ట్స్ నుంచి ఇంత మంది ప్రొడ్రూసర్లు రావడం, మంచి సినిమాలు చేయడం గొప్ప విషయమని నటుడు సత్యదేవ్ అన్నారు.
‘మీరంతా అల్లు అర్జున్‌తో మీకున్న అనుబంధం, ఆయన మీకు అందించే సహకారం గురించి చెబుతుంటే సంతోషంగా ఉంది. అల్లుఅర్జున్‌కు హ్యాట్సాఫ్. ఈ రోజుల్లో వెబ్‌సిరీస్‌లు, సినిమాల మధ్య గీత చెరిగిపోయింది. మంచి కథ ఎక్కడ ఉన్నా ప్రేక్షకులు ఆదరిస్తారు’ అని సత్యదేవ్ అన్నారు. విరాజ్ అశ్విన్ కథానాయకుడిగా వినోద్ గాలి దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్‌సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’. జులై 3 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో సిరీస్ ట్రైలర్ ఆవిష్కరణ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్యదేవ్ హాజరై మాట్లాడారు. ఈ వార్త చదివారా: ఆమెకు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి వస్తుంది: షారుక్