
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Cobra Sits On Nandi Idol Video Watch: ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒక అద్భుతమైన, అత్యంత అరుదైన వీడియో సోషల్ మీడియా వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సాధారణంగా పాములను చూస్తేనే ప్రజలు భయాందోళనతో పరుగులు తీస్తూ ఉంటారు.. అలాంటిది అత్యంత ప్రమాదకరమైన ఒక నాగుపాము.. శివాలయంలోని నంది విగ్రహంపై తిష్ట వేసి కూర్చున్న దృశ్యాలు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వైరల్ అవుతున్న వీడియోలో.. ఆలయ ప్రాంగణంలో ఉన్న నంది విగ్రహం తలపై నాగుపాము ఎంతో ప్రశాంతంగా కూర్చొని ఉంది.. అంతటితో ఆగకుండా.. ఆ పాము తన పడగలను విప్పి అటూ ఇటూ ఊగుతూ భక్తులకు దర్శనం ఇవ్వడం ఈ వీడియోలోనే అత్యంత ప్రధాన ఆకర్షణీయంగా నిలిచింది. నంది వాహనుడైన ఆ శివుడి చెంతనే ఉండే నాగేంద్రుడు.. ఇలా ప్రత్యక్షంగా నంది పైనే కొలువుదీరడం చూసి భక్తులు భక్తిశ్రద్ధలతో చేతులు జోడిస్తున్నారు. అంతేకాకుండా అక్కడికి వచ్చిన భక్తులంతా ఈ నాగేంద్రుడి దర్శనం కూడా చేసుకుంటున్నారు..
సాక్షాత్తు ఆ మహాశివుడి స్వరూపమే.. ఈ దృశ్యాలు చూసిన సోషల్ మీడియా వినియోగదారులతో పాటు శివ భక్తులు నంది విగ్రహం పై ఉన్న నాగుపాము సాక్షాత్తు ఆ మహా శివుడి లీలేనని.. కామెంట్లలో చెబుతూ వస్తున్నారు.. అంతేకాకుండా ఇది మహా శివుడి లీల అని నమ్మిన వారి. ఓం నమశ్శివాయ అంటూ కామెంట్ల రూపంలో నెటిజన్లు తమ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు.. శివుని మెడలో ఉండే సర్పరాజం.. శివుడి వాహనమైన నందిపై ఇలా పడగ విప్పి కూర్చోవడం కలియుగంలో దైవత్వానికి నిదర్శనమని పలువురు పండితులు భావిస్తున్నారు..
ఊహించని స్థాయిలో వ్యూస్.. ఈ వీడియో ఎక్కడ.. ఏ ప్రాంతంలో జరిగిందని దానిపై స్పష్టమైన సమాచారం లేనప్పటికీ.. దీనికి వస్తున్న ఆదరణ మాత్రం అంతా కాదు.. క్షణాల్లోనే ఈ వీడియో లక్షలాది వ్యూస్ తో పాటు వేలాది షేర్లతో దూసుకుపోతోంది.. వాట్సాప్ స్టేటస్ లతోపాటు ఇంస్టాగ్రామ్ రీల్స్ లో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందని వివరాలు తెలియక పోయినప్పటికీ.. వీడియో మాత్రం ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. అంతేకాకుండా సోషల్ మీడియా వినియోగదారులను ఆకట్టుకుంటుంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.