
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
kalvakuntla kavitha fires on deputy cm Pawan kalyan: తెలంగాణ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. ఏ మాత్రం చాన్స్ దొరికిన కూడా నేతలు ఆరోపణలతో ఒకరిపై మరోకరు విరుచుకు పడుతున్నారు. ఈక్రమంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఉప్పల్ లో ప్రత్యేకంగా కార్యక్రమం జరిగింది. దీనికి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హజరయ్యారు.టీఆర్ఎస్ పార్టీ జెండా సైతం ఆవిష్కరించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు.
కల్వకుంట్ల కవిత ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఇడుపు కాయితం సినిమాపేరుపై కొంత మంది ట్రోల్స్ చేయడంతో దీనిపై కవిత ఫైర్ అయ్యారు. ఈ మూవీలో.. ప్రియదర్శి హీరోగా, తెలంగాణ జానపద పాటల ద్వారా పాపులర్ అయిన నాగదుర్గ కథానాయికగా ఈ సినిమా తెరకెక్కనుంది. దీనిపై నెట్టింట ట్రోల్ లు చేయడంతో కవిత మాట్లాడుతూ.. ఇడుపు కాయితం అర్థం పవన్ కళ్యాణ్ ను అడిగితే బాగా చెబుతాడని సెటైర్లు వేశారు.
ఉద్యమంలో అవాకులు, చేవాకులు పేలిన వాళ్లే మళ్లీ తెలంగాణపై కుట్ర చేస్తున్నారన్నారు. ఆనాడు తెలంగాణను అడ్డుకున్న అనకొండలు, కార్పొరేట్ శక్తులకు పాలు పోసి పెంచుతున్నది బీఆర్ఎస్ లో ఉన్న గుంటనక్కే అని బీఆర్ఎస్ లోని నేతపై ఇన్ డైరెక్ట్ గా ఫైర్ అయ్యారు. తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతుంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ గప్ చుప్ అయ్యాయని ఎద్దేవా చేశారు.
తెలంగాణ కోసం పోరాటం చేసేది ఒక్క టీఆర్ఎస్ మాత్రమే అని ప్రజలు గుర్తుంచుకొవాలన్నారు. ఉప్పల్ అంటేనే తెలంగాణ ఉద్యమానికి అడ్డా అని పేర్కొన్నారు. అలాంటి ప్రాంతంలో మనం ఇవ్వాళ జెండా ఎగురవేసుకోవటం సంతోషంగా ఉందన్నారు. ఉద్యమంలో మనం అనుకున్నవి తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా సాధించు కోలేకపోయామన్నారు.
ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇస్తామన్న 250 గజాల భూమి కోసం జులై 2 న ఉప్పల్ భగాయత్ లో పెద్ద ఎత్తున భూపోరాటం చేస్తున్నామని అన్నారు. ఈ పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులంతా పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. రాష్ట్రంలో ఉద్యమకారులు, మహిళలు, విద్యార్థుల కోసం తెలంగాణ రక్షణ సేన పోరాటం చేస్తుందని కవిత క్లారిటీ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చాక కచ్చితంగా ఉచిత విద్య, వైద్యం అందిస్తుందన్నారు. ఉద్యమకాలంలో అవాకులు, చేవాకులు పేలిన వాళ్లంతా మళ్లీ ఇప్పుడు పేట్రేగిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఒకసారి ఇలా అవహేళన చేస్తేనే పోరాటం చేసి తెలంగాణ సాధించు కున్నామని గుర్తు చేశారు. ఒకరి బాషను ఒకరు గౌరవించుకుందాం. కానీ మా బాషను అవమానిస్తే ఊరుకునేది లేదని కవిత తెల్చి చెప్పారు.
తెలంగాణ బాషను అవమానిస్తే కాంగ్రెస్ ఏమీ అనటం లేదు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ ఉద్యమంతోనే సంబంధం లేదని ఏకీపారేశారు. ఇక బీజేపీ అయితే దేశం అంటూ మనల్ని పట్టించుకోవటం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడటం లేదు. పట్టించుకోవటం లేదన్నారు.
ఎందుకంటే ఆ పార్టీలో ఉండే గుంటనక్క... నారాయణ, చైతన్య విద్యాసంస్థలతో పాల వ్యాపారం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. నారాయణ, చైతన్య, సహా పెద్ద కార్పొరేట్ స్కూల్స్, హాస్పిటల్స్ లో మదర్ డెయిరీ, ముల్కానూరు, విజయ డెయిరీల నుంచే పాలు కొనాలంటూ ప్రభుత్వం జీవో తేవాలన్నారు.
ఎన్నో రోజుల నుంచి స్కూల్ ఫీజులు తగ్గించాలంటే ఈ ముఖ్యమంత్రి తగ్గించటం లేదని కవిత ఆందోళనలు వ్యక్తం చేశారు. ఆయా కార్పొరేట్ స్కూళ్లలో కనీసం కటింగ్, బట్టలు ఉతకటం, ఫర్నీచర్ వంటి వాటికి కూడా మన వాళ్లకు అవకాశం ఇవ్వటం లేదన్నారు.
ఇప్పుడు నార్త్ ఇండియా నుంచి వస్తున్న స్కూళ్లలో కూడా బాత్ రూమ్ లను కడిగేందుకు కూడా అక్కడి వాళ్లనే తెచ్చు కుంటున్నారన్నారు. ఇలాంటి సమయంలో మన హక్కుల కోసం ఒక్క టీఆర్ఎస్ మాత్రమే మాట్లాడు తోందన్నారు. బీఆర్ఎస్ కు తెలంగాణతో పేగు బంధం తెగిపోయిందని, తెలంగాణ ప్రజలు, ఉద్యమకారుల కోసం నేను పోరాటం చేస్తానని కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
Read more: Pawan Kalyan Meets Niranjan: అభిమాని నిరంజన్ కోరిక నెరవేర్చిన పవన్ కళ్యాణ్.. అండగా ఉంటానంటూ భరోసా..!
ఉద్యమకారుల కోసం జులై 2 న చేపట్టే భూపోరాటానికి పెద్ద ఎత్తున ఉద్యమకారులు రావాలని పిలుపునిచ్చారు. ఉప్పల్ లో అన్ని డివిజన్లలో మేము పోటీ చేస్తామని, భవిష్యత్ లో ఉప్పల్ ఎమ్మెల్యే సీటు కూడా గెలుస్తామని కవిత ధీమా వ్యక్తం చేశారు. ఒక రాజకీయ పార్టీ ఎలా సేవ చేస్తుందో, ప్రజల కోసం ఎట్ల పనిచేస్తుందో మేము చూపిస్తామని కవిత ప్రజలకు భరోసా ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.