
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
White Cobra Video Watch: ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో వింతలతో పాటు విశేషాలు దాగి ఉన్నాయి.. ముఖ్యంగా వన్యప్రాణుల ప్రపంచంలో కొన్ని జీవులు చాలా అరుదుగా కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఒక అరుదైన ఘటనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. సాధారణంగా మనం నలుపు.. ఎరుపు, గోధుమ రంగులో ఉండే కింగ్ కోబ్రాలను చూస్తూ ఉంటాం.. కానీ ఊహించని విధంగా ఒక వైట్ కలర్ మెరిసిపోతున్న కింగ్ కోబ్రా ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తున్నాయి.
ఒక ప్రాంతంలో కొత్తగా ఇల్లు నిర్మిస్తున్న ఓ ప్రాంగణంలో ఈ వింత పాము ప్రత్యక్షమైంది.. ఆ ఇంటి నిర్మాణంలో భాగంగా కడుతున్న ఒక గోడ సందు గుండా ఈ తెల్ల కింగ్ కోబ్రా అత్యంత నెమ్మదిగా.. పాకుతూ బయటికి రావడం స్థానికుల కంటపడింది.. సాధారణంగానే కింగ్ కోబ్రాల్ అంటేనే భయంతో వణికిపోయే జనం.. ఇక అస్సలు ఎప్పుడు చూడని తెల్లటి రంగులో అంత పెద్ద పామును చూసేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైపోతున్నారు.. ఆ పాము పరిమాణంతో పాటు దాని తెల్లటి రూపం స్థానికులను అటు భయాందోళనకు.. ఇటు తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుంది.. కొందరు ధైర్యం చేసి ఆ అద్భుత దృశ్యాన్ని మొబైల్స్ లో చిత్రీకరించారు..
నిర్మిస్తున్న గోడల సమీపంలో నుంచి ఆ తెల్లటి సర్పం బయటికి వస్తుంటే ఏదో సినిమా గ్రాఫిక్స్ చూస్తున్నట్లు అనిపిస్తుంది. నిజంగా ఇలాంటి పాము ఉంటుందని మేము ఎప్పుడూ ఊహించలేము అని స్థానికులు సైతం ఆశ్చర్యపోతున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ఇన్స్టాగ్రామ్, ఎక్స్ లలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. ఇది నిజంగా శ్వేత నాగు అని కొందరు అంటుంటే.. ల్యూసిజం (Leucism) లేదా అల్బినిజం (Albinism) అనే జన్యులోపం వల్లే పాములకు ఇలాంటి తెల్లటి రంగు వస్తుందని వన్యప్రాన్ని విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు..
విషయం తెలుసుకున్న వెంటనే స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.. వారి వెంటనే స్నేక్ క్యాచర్స్‌కు సమాచారం అందించి వారిని ఈ ప్రదేశానికి పంపినట్లు తెలుస్తోంది. ఈ అరుదైన జీవికి ఎలాంటి హానిక అలగకుండా.. సురక్షితంగా రక్షించి దట్టమైన అడవి ప్రాంతంలో విడిచి పెట్టినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రకృతిలోని ఈ అరుదైన పాముకు సంబంధించిన వీడియోను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఈ వీడియో ఒక ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి వైరల్ అవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.