
అమరావతి: స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు మంచి రుచికరమైన భోజనం పెడుతుంటే వైకాపా అధినేత జగన్ ఓర్వలేకపోతున్నారని విద్యాశాఖమంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు.
స్మార్ట్ కిచెన్ల ద్వారా మహిళలు, పేదలకు ఉపాధి కల్పిస్తుంటే జగన్ తట్టుకోలేకపోతున్నారన్నారు. కడప జిల్లాలో 5 స్మార్ట్ కిచెన్లను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని.. హెడ్ కుక్స్, అసిస్టెంట్ కుక్స్, హెల్పర్లు, డ్రైవర్లకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. వీటితోపాటు జిల్లాలో 33 స్మార్ట్ కిచెన్లు ఏర్పాటుచేసి.. 392 మందికి ఉపాధి కల్పించబోతున్నామని పేర్కొన్నారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంటే జగన్క్ బాధ ఎందుకని లోకేశ్ ప్రశ్నించారు. పేదలు బాగుపడితే చూడలేకపోతున్నారా? అని నిలదీశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.