
విజయవాడ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని.. తన సోదరుడు, ప్రస్తుత విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు.
హైదరాబాద్ శివార్లలోని వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు చిన్ని ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ భూకబ్జా యత్నాన్ని తక్షణమే అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ నగర శివారులోని ప్రగతి నగర్, షంషిగూడ ప్రాంతంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు (టీజీఐఐసీ) చెందిన 112.72 ఎకరాల భూమి ఉంది. దీనిని ఐటీ పార్క్ కోసం కేటాయించారు. అయితే, ఈ అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని ఎంపీ కేశినేని చిన్ని, ఆయన బినామీగా వ్యవహరిస్తున్న మెసర్స్ ఎక్సెల్లా ప్రాపర్టీస్ అనే సంస్థ అక్రమంగా చేజిక్కించుకోవాలని చూస్తున్నాయని కేశినేని నాని తన లేఖలో ఆరోపించారు. ఈ భూమిపై ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు ఆదేశాలు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆంక్షలు అమల్లో ఉన్నాయని, ఈ కీలక విషయాలను దాచిపెట్టి మోసానికి పాల్పడుతున్నారని నాని పేర్కొన్నారు.ఈ వాస్తవాలను మరుగునపరిచి, సుప్రీంకోర్టులో ఒక మోసపూరిత రాజీ ఒప్పందాన్ని చూపి ప్రభుత్వ భూమిని కొట్టేయాలని కుట్ర చేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. గతంలో జిల్లా కలెక్టర్ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఈ భూమిపై ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి హక్కులు లేవని (జీరో ప్రైవేట్