
సాక్షి, గుంటూరు: రాజధాని అమరావతి పేరుతో ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కోడానికి ప్రయత్నిస్తుందని పెనుమాక రైతులు అన్నారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ..
Jun 28 2026 12:17 PM | Updated on Jun 28 2026 12:31 PM
సాక్షి, గుంటూరు: రాజధాని అమరావతి పేరుతో ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కోడానికి ప్రయత్నిస్తుందని పెనుమాక రైతులు అన్నారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. మా భూములు లాక్కోడానికి ఒక వైపు భూ సమీకరణ, మరో వైపు భూసేకరణ అమలు చేస్తున్నారు. రైతుల పొలాల్లో గుంటలు తవ్వుతున్నారు.. రోడ్లు వేస్తున్నారు.. అనేక విధాలుగా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది’’ అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం అరాచకాన్ని వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వెళ్లాం. దీంతో రైతు పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. మా బాధలు వినడానికి ఆ కమిటీ మా భూములు చూడటానికి వస్తే తెలుగుదేశం నాయకులు అడ్డుకోవడం దారుణం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కాదు. సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీని మా భూములను పరిశీలించడానికి మళ్లీ ఆహ్వానిస్తాం. అవసరమైతే వైఎస్ వైఎస్ జగన్‌ని మా గ్రామానికి ఆహ్వానిస్తాం’’ అని పెనుమాక రైతులు తెలిపారు.
‘‘ఉండవల్లిలో టీడీపీ గూండాల అరాచకంపై పెనుమాక రైతులు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాల దాడి దుర్మార్గం. మేం పిలవడం వల్లనే రైతు పరిరక్షణ కమిటీలో ఉన్న నేతలు వచ్చారు. ప్రభుత్వం ఎంతసేపటికీ మా పొలాలను లాక్కునేందుకు చూస్తోంది. కానీ మాకు న్యాయం చేసేలా ప్రభుత్వం వ్యవహరించడం లేదు’’ అంటూ చంద్రబాబు సర్కార్‌పై రైతులు మండిపడ్డారు.
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 28 - జూలై 05)
నిర్మాతగా అల్లు అర్జున్ ఫ్రెండ్.. 'జోకర్' మూవీ లాంచ్ (ఫొటోలు)
భాగ్యరాజ్‌కు నివాళి అర్పించిన కోలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)
తెరపై నవ్వు.. తెర వెనుక విజన్.. భాగ్యరాజ్ అరుదైన (ఫొటోలు)
మేడిపల్లి PS పరిధిలో దారుణం.. గృహప్రవేశం జరిగిన ఇంటిపై దాడి
200 భాషల్లో వారణాసి.. జక్కన్నను ఆకాశానికి ఎత్తేసిన ప్రియాంక
నువ్వు హోమ్ మినిస్టర్ గా ఉండి ఎవడికి ఉపయోగం... అనితపై కాకాని పూజిత సీరియస్
ఐర్లాండ్ చేతిలో ఓటమి.. ఫుల్ హ్యాపీలో ఫ్యాన్స్ ..అసలు కారణం ఇదే