
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Telangana BJP: అన్ని ఉన్న అల్లుడి నోట్ల.. డాష్.. డాష్ అన్నట్టుగా ఉంది తెలంగాణలో బీజేపీ పరిస్థితి. ఇక్కడ నాయకులకు కొదవ లేదు. కానీ అందరు ఒక్కతాటిపై నిలబడిన సందర్భాలు లేవు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా సాగుతుంది పరిస్థితి. తెలంగాణ బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు ఢిల్లీ వేదికగా చాడీలు గట్రా చెప్పుకుంటూ ఇక్కడ పార్టీని ఎదగకుండా చేస్తున్నారనే వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ తెలంగాణపై పూర్తిగా ఫోకస్ పెట్టారు.
ఈ క్రమంలోనే ఈ రోజు రాష్ట్రానికి బీజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రానున్నారు.అంతేకాదు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఇక్కడి రాష్ట్ర నేతలకు రోడ్ మ్యాప్ ఇవ్వనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న వైఫల్యాలను క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ ఫోకస్ చేసినట్టు బీజేపీ చేయలేకపోతుందనే టాక్ ప్రజల్లో ఉంది. ఇక నితీన్ నబీన్ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం నుంచి నాలుగు గంటలకు రంగారెడ్డి రూరల్‌లో కొత్తగా నిర్మించిన తొమ్మిది బీజేపీ కార్యాలయాలను ప్రారంభిస్తారు.
అంతేకాదు తెలంగాణలో బీజెపీని సంస్థాగతంగా బలోపేతం చేయడం అధికార పీఠం కైవసం చేసుకునే దిశగా కార్యకర్తలను సమాయత్తం చేయడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. ఈ టూర్లో నితిన్ నబీన్ పార్టీ శ్రేణులతో సమావేశం అవుతారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
రీసెంట్గా ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చిన పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపారు. మరోవైపు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ నేపత్యంలో మూడు రోజుల పర్యటన నేపథ్యంలో నితిన్ నబీన్ ఒకవైపు పార్టీ శ్రేణులతోపాటు మరోవైపు వివిధ వర్గాలతో ఆయనతో సమావేశం కానున్నారు. అటు బీజేపీ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించే విజయ సంకల్ప సభకు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో జిహెచ్ఎంసి, మల్కాజగిరి కార్పొరేషన్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సుమారు 15,000 మందిపోలింగ్ బూత్ అధ్యక్షులు, ఏజెంట్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. వారిని ఉద్దేశించి నితిన్ నబీన్ మాట్లాడబోతున్నారు.
అనంతరం రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, మ్మెల్సీలు వీరందరితో కూడా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు.రెండో రోజు పర్యటనలో భాగంగా ఇటు విబిఐటి కాలేజీలో యువ సమ్మేళనంలో ఆయన పాల్గొనబోతున్నారు. ఇక యువ సమ్మేళనంలో పాల్గొని ఎవరైతే జెమ్ జెడ్ గా పిలవబడుతున్నారో వారందరికీ కూడా దిశా నిర్దేశం చేయబోతున్నారు. ఇక అనంతరం అక్కడి నుండి ఉత్తర తెలంగాణ పరిధిలోని వరంగల్‌లో గిరిజనులతో బేటీ బేటీ అనంతరం పోలింగ్ బూతుల అధ్యక్షుల సమావేశానికి కూడా హాజరు కానున్నారు. ఇక ముఖ్యంగా ఈ పర్యటన అంతా హైదరాబాద్, వరంగల్‌లో జరగనుంది. రాబోయే రోజుల్లో ఇక్కడ జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ఉంది. అలా రాబోయే 2028 ఎన్నికల టార్గెట్‌గా పనిచేస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.