
గొంతులో చేప ముల్లు ఇరుక్కుందా.. ఇలా చేస్తే క్షణాల్లోనే రిలీఫ్..గొంతులో చేప ముల్లు ఇరుక్కుందా.. ఇలా చేస్తే క్షణాల్లోనే రిలీఫ్ Krishna 28 June 2026 గొంతులో ముల్లు ఇరుక్కున్నప్పుడు..
అన్నాన్ని ఒక చిన్న ముద్దగా చుట్టి.. దానిని నమలకుండా ఒకేసారి మింగేయాలి. అన్నం ముద్ద జిగురు గుణానికి ముల్లు అంటుకుని సులభంగా కడుపులోకి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. అన్నం ముద్ద బాగా పండిన ఏదైనా ఒక పెద్ద పండు ముక్కను తీసుకుని, దానిని ఎక్కువగా నమలకుండా మింగాలి. పండు యొక్క మెత్తటి గుజ్జుకు గొంతులోని ముల్లు సులభంగా అంటుకుని, ఆహార నాళం ద్వారా కిందకు జారిపోతుంది.
పండు తినడం ఒక బ్రెడ్ ముక్కను తీసుకుని నీరు లేదా పాలలో ముంచండి. ఆ తర్వాత దానిని ఒక చిన్న ఉండలా చుట్టి మింగేయాలి. బ్రెడ్లోని స్పాంజ్ లాంటి తత్వం గొంతులోని ముల్లును లాగేసి, సులభంగా కడుపులోకి తీసుకెళ్తుంది.
గొంతులో ముల్లు ఇరుక్కుని తీవ్రమైన నొప్పిగా అనిపిస్తే.. ఒకటి లేదా రెండు చెంచాల ఆలివ్ నూనెను తాగడం చాలా మంచిది. ఆలివ్ నూనె గొంతులో ఒక కందెన లాగా పనిచేసి ముల్లు కడుపులోకి జారిపోవడానికి సహాయపడుతుంది.
ఆలివ్ నూనె కొద్దిగా నిమ్మరసం తాగడం కూడా ఈ సమస్యకు మంచి పరిష్కారం. నిమ్మరసంలో ఉండే సహజసిద్ధమైన ఆమ్ల గుణాలు గొంతులోని ముల్లు గట్టిదనాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల ముల్లు మెత్తబడి లోపలికి జారిపోతుంది.
నిమ్మరసం చాలామంది గొంతులో ముల్లు ఇరుక్కున్న వెంటనే కంగారులో నోట్లోకి వేళ్లు పెట్టి ముల్లును తీయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి తప్పు అస్సలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల ముల్లు మరింత లోపలికి వెళ్లే ప్రమాదం ఉంది.
వేళ్లతో కంటికి కనిపించని ముల్లు కోసం వేళ్లతో లేదా ఏదైనా పదునైన వస్తువులతో గొంతు లోపల పదేపదే గిచ్చడం వల్ల గొంతులోని సున్నితమైన చర్మంపై కోతలు పడే అవకాశం ఉంది. ఇది ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు.
గాయాలు ఈ చిట్కాలు పాటించిన తర్వాత కూడా ముల్లు రాకపోతే లేదా గొంతులో నొప్పి, రక్తం రావడం వంటి తీవ్రమైన లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే ఈఎన్టీ వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
అందాల ముద్దుగుమ్మ మరిన్ని వెబ్ స్టోరీస్ వారెవ్వా వాల్నట్స్ ..ఇలా తిన్నారంటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు! ఈ దిశలో మందార మొక్కను నాటితే ఐశ్వర్యం మీ వెంటే! బొప్పాయి అమృతమే..కానీ, వీళ్లు తిన్నారంటే కష్టమే!