
సినిమా ఇండస్ట్రీలోని చాలా మంది డాక్టర్‌ను కాబోయి యాక్టర్‌ను అయ్యాను అంటుంటారు. కానీ కమెడియన్ భద్రం మాత్రం ముందు డాక్టర్ అయిపోయి ఆ తరవాత యాక్టర్ అయ్యాడు. ఇప్పటివరకు సుమారు రూ.
150 కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన వెల్నెస్ ట్రైనర్‌గానూ సేవలు అందిస్తున్నారు. హైదరాబాద్‌లో ఎర్గొనోమిక్స్ (ఫిజియోథెరపిస్ట్) డాక్టర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారీ నటుడు. గూగుల్, ఇన్ఫోసిస్ లాంటి సాఫ్ట్వేర్, ఐటీ కంపెనీలలో స్పెషలిస్ట్ డాక్టర్‌గా పనిచేస్తూ, దేశవ్యాప్తంగా ఎర్గానామిక్స్ ట్రైనింగ్, వర్క్‌షాప్‌లను నిర్వహిస్తున్నాడు. ఆరోగ్యానికి సంబంధించి బయట వర్క్ షాపులు నిర్వహించే ఆయన సోషల్ మీడియాలోనూ ప్రజలకు సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ఆరోగ్యం, వ్యాయామం, యోగా, లైఫ్ స్టైల్ తదితర అంశాలకు సంబంధించిన టిప్స్ ఇస్తుంటారు. దీనికి అభిమానులు, నెటిజన్ల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. అలా తాజాగా మరో సూపర్ చిట్కా అందించారు భద్రం. అదేంటంటే..
బరువు తగ్గేందుకు చాలా మంది చాలా రకాలుగా ట్రై చేస్తుంటారు. కొందరు నోరు కట్టేసుకుంటారు. మరికొందరు వర్కౌట్లు అంటూ గంటల తరబడి జిమ్ లో గడిపేస్తుంటారు. అయితే గుట్ట లాంటి పొట్ట తగ్గేందుకు ఒక సూపర్ టిప్ అందించాడు భద్రం. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ ఏశాడు. ఇందులో పొట్ట తగ్గాలంటే కేవలం డైమ్ మాత్రమే సరిపోదు.. కోర్ మజిల్స్ కూడా యాక్టివ్ కావాలంటున్నాడు భద్రం.ఇందుకోసం రోజూ ఒక నిమిషం పాటు స్టమక్ వాక్యూమింగ్ కూడా ప్రయత్నించాలని సూచించాడు. అది ఎలా చేయాలో స్వయంగా తానే చేసి ఈ వీడియోలో చూపించాడు భద్రం. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
బరువు తగ్గే వారి కోసం.. భద్రం షేర్ చేసిన వీడియో ఇదిగో..
పొట్ట తగ్గాలంటే కేవలం డైట్ మాత్రమే కాదు... కోర్ మసిల్స్ కూడా యాక్టివ్ కావాలి. రోజుకు 1 నిమిషం స్టమక్ వాక్యూమింగ్ ప్రయత్నించండి!"#పొట్టతగ్గించేద్దాం #StomachVacuum #CoreStrength #HealthTipsTelugu #DrBhadram #Wellness #FitnessTips #HealthyLifestyle #BellyFat #HealthShots మీరు "ఊపిరి" కరెక్ట్ గా తీసుకుంటున్నారా? #wellnessdoctor #preventivecare #exercise #breathe #5ksteps #actorbhadram #lifestyle #drbhadram No More Stress at Desk.#CorporateWellness#Learning& Development #HRTrainings#Safety#EmployeeProductivity#HealthyEmployees మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.