
ఉదయాన్నే పాఠశాలలకు వెళ్లే పిల్లలు, కూరగాయల సంచితో మార్కెట్‌కి వెళ్లే మహిళలు, నడుచుకుంటూ ఆస్పత్రికి వెళ్లే రోగులతో ఆ రోడ్లు కిటకిటలాడతాయి.
కానీ, అలాంటి వారికి రోడ్డు పక్కనే ఫుట్‌పాత్‌లు అందుబాటులో లేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వివిధ పట్టణాల్లో పాదచారుల కోసం నిర్మించిన కాలినడక మార్గాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఫలితంగా వాహనాల మధ్యే ప్రాణాలు పణంగా పెట్టి నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. ఈ వార్త చదివారా: వైకాపా నేతల పర్యటనలో రౌడీషీటర్లు: 3 కేసులు నమోదు