
Samantha : సమంత ఇటీవల మా ఇంటి బంగారం సినిమాతో వచ్చి మంచి విజయం సాధించింది. ఈ సినిమా ఇప్పటికే 70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని మూవీ యూనిట్ ప్రకటించింది.
ఈ సినిమాలో సమంత యాక్షన్ సీన్స్ తో అదరగొట్టేసింది. అలాగే ఈ సినిమాలో సమంత చాలా సీన్స్ లో కార్, టీవీఎస్ డ్రైవ్ చేస్తుంది.
టీవీఎస్ మీద శ్రీముఖిని ఎక్కించుకొని ఊరంతా తిప్పే ఓ సీన్ కూడా ఉంటుంది ఈ సినిమాలో. అయితే ఆ సీన్ లో సమంత నిజంగా టీవీఎస్ తోలలేదు అని ఇప్పుడు ఓ మేకింగ్ వీడియోతో తెలిసిపోయింది. యాంకర్ శ్రీముఖి తాజాగా తన యూట్యూబ్ ఛానల్ లో మా ఇంటి బంగారం మేకింగ్ వీడియోలు షార్ట్స్ రూపంలో పోస్ట్ చేస్తుంది.
Also See : Sravanthi Chokarapu : మగధీర కాజల్ డ్రెస్లో కవ్విస్తున్న యాంకర్ స్రవంతి..
సినిమాలో శ్రీముఖిని ఎక్కించుకొని సమంత టీవీఎస్ తొలి సీన్ ని ఎలా షూట్ చేసారో కూడా పోస్ట్ చేసింది. ఓ వెహికల్ కి కెమెరా సెటప్ పెట్టి ఆ వెహికల్ కి ఒక ట్రాలీని కట్టారు. ఆ ట్రాలీ మీద టీవీఎస్ పెట్టారు. ఆ టీవీఎస్ పైన సమంత, శ్రీముఖి కూర్చున్నారు అంతే. వెహికల్ ముందుకు వెళ్తుంటే ఆటోమేటిక్ గా ఆ ట్రాలీ కూడా వస్తుంది. దీంతో సమంత టీవీఎస్ తోలినట్టు హావభావాలు ఇస్తే సరిపోతుంది. ఈ వీడియోతో సమంత ఈ సినిమాలో రియల్ గా టీవీఎస్ తోలలేదు అని తెలుస్తుంది.
చాలా సినిమాల్లో నటీనటులకు డ్రైవింగ్ రాకపోతే సీన్స్ ఇలాగే షూట్ చేస్తారు. ఒక ట్రాలీ మీద బండి పెట్టి దానిపై కూర్చొని డ్రైవ్ చేస్తున్నట్టు హావభావాలు ఇస్తారు నటీనటులు. డ్రైవింగ్ వస్తే మాత్రం వాళ్ళు డ్రైవ్ చేస్తూ యాక్టింగ్ చేస్తుంటే ముందు వెహికల్ లో కెమెరా సెటప్ పెడతారు. ఒక్కోసారి డ్రైవింగ్ వచ్చినా సేఫ్టీ కోసం కూడా ఇలాగే షూట్ చేస్తారు. ప్రస్తుతం సమంత, శ్రీముఖి మా ఇంటి బంగారం మేకింగ్ వీడియో వైరల్ గా మారింది.