
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తితిదేకి అనంత్ అంబానీ భారీగా విరాళాలు ప్రకటించారు. 25 ఎలక్ట్రిక్ బస్సులు విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. 50 మంది బస్సు డ్రైవర్ల జీతభత్యాలు కూడా చెల్లించడంతో పాటు, తిరుమలలో ఛార్జింగ్ స్టేషన్ను రిలయన్స్ ఏర్పాటు చేయనుంది. గుజరాత్ వంతారాలో ఉన్నట్టుగా తితిదే గోశాలను ఆధునికీకరణకు అంగీకారం తెలిపారు. ఈ వార్త చదివారా: 6-7 గంటల్లోనే బెంగళూరుకు