
ఆధునిక జీవనశైలి, గంటల తరబడి కూర్చొని పనిచేయడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాటీ లివర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.
కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల కలిగే ఈ సమస్యను సరైన సమయంలో గుర్తించి, జీవనశైలిలో మార్పులు చేసుకోకపోతే తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తుంది. అయితే, ఆరోగ్యకరమైన స్నాక్స్ తినడం ద్వారా ఈ సమస్యను నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రుచికి రాజీ పడకుండానే కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని భరోసా ఇస్తున్నారు.ఈ నేపథ్యంలో హార్వర్డ్ కాలేయ వ్యాధి నిపుణుడు డాక్టర్ సౌరభ్ సేథి ఫ్యాటీ లివర్‌ను అదుపులో ఉంచేందుకు సహాయపడే ఏడు అద్భుతమైన స్నాక్స్ గురించి వివరించారు. అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా ఫైబర్, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఈ స్నాక్స్‌ను తీసుకోవడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉండటంతో పాటు జీవక్రియ కూడా మెరుగుపడుతుందని ఆయన తెలిపారు.డాక్టర్ సౌరభ్ సేథి సూచించిన 7 ఆరోగ్యకరమైన స్నాక్స్:1. నట్స్, విత్తనాలు: బాదం, వాల్నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు, చియా, అవిసె గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. అయితే, వీటిని ఉప్పు లేకుండా పచ్చిగా లేదా డ్రై-రోస్ట్ చేసి తినడం మంచిదని డాక్టర్ సేథి సూచించారు.2. పనీర్ లేదా మొజారెల్లా చీజ్: పనీర్, మొజారెల్లా చీజ్‌లో ప్రోటీన్, కాల్షియం అధిక మోతాదులో లభిస్తాయి. ఇవి కడుపు నిండిన అనుభూతిని ఇవ్వడమే కాకుండా, కండరాల ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి. వీటిని నేరుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తినవచ్చు.3. అవకాడో: