దర్శకుడు కథ చెప్పే విధానం ఏదైనా కావచ్చు కానీ.. ప్రేక్షకుడు చూసే కోణం రకరకాలుగా ఉంటుంది. కార్తీకదీపం పార్ట్ 01లో కానీ.. పార్ట్ 02లో కానీ..
నీతి, నియమాలను పక్కన పెడితే విలన్‌పై కథానాయికదే పై చేయి అవుతుంది. ఇప్పుడు కార్తీకదీపం 2 కథ చూస్తే.. దీప గతం ఏమైనా అయ్యి ఉండొచ్చు కానీ.. పారిజాతం బిడ్డల్ని మార్చి పెద్ద తప్పే చేసి ఉండొచ్చు కానీ.. జ్యోత్స్న వైపు నుంచి చూస్తే దీప వచ్చిన తరువాత ఆమెకి అన్యాయం జరుగుతుంది. అప్పట్లో జ్యోత్స్న యాక్సిడెంట్ చేసిందని పోలీసులకు సాక్ష్యం చెప్పి ఆమెకి కెరియర్ లేకుండా చేసింది దీప. ఆ తరువాత పని మనిషిగా వచ్చి పంగనామం పెట్టినట్టుగా తన బావే సర్వస్వం అనుకున్న జ్యోత్స్నకి కార్తీక్‌ని దూరం చేసింది. జ్యోత్స్నకి అసలు తనకంటూ ఫ్యామిలీనే లేకుండా చేసింది. అసలు దీప రాకుండా ఉండే.. జ్యోత్స్న పరిస్థితి అలా అయ్యేదా? నిజమైన వారసురాలు దీపే కాబట్టి.. ఇవన్నీ ఆమెకి చెందడమే న్యాయం. కానీ ఇప్పుడు నిజానిజాలు తెలియలేదు. అయినా కూడా.. జ్యోత్స్నకి చెందాల్సినవి అన్నీ దీప అనుభవిస్తుంది. కాసేపు దీప వైపు నుంచి కాకుండా.. జ్యోత్స్న వైపు నుంచి కథని చూస్తే.. తాను పెళ్లి చేసుకోవాలని కలలు కన్న వాడు.. వేరే పెళ్లైన మహిళతో తన కళ్ల ముందే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటే ఏ ఆడదైనా సహించగలదా? తన తల్లి తనని కాకుండా.. వేరే పనిదానికి కూతురు స్థానం ఇచ్చి.. నెత్తిన పెట్టుకుంటే.. ఏ కూతురైనా తట్టుకోగలదా? తన కెరియర్ లేకుండా పోవడానికి కారణమైన దీపనే తన జీవిత మార్గదర్శిగా చూపిస్తుంటే.. ఏ ఆడపిల్ల అయినా తట్టుకోగలదా? అంత చదువుకుని ఐదోతరగది దాన్ని తీసుకొచ్చి సీఈవోని చేస్తే.. మనషిలోని మృగం బయటకు రాకుండా ఉంటుందా? ఇవన్నీ ఇవన్నీ పక్కనపెడితే.. సూరజ్ ఎంట్రీ తరువాత కథ స్వరూపం మొత్తం మారిపోయింది. అతను హీరో అని కాసేపూ.. కనిపించని శత్రువు అని కాసేపూ డౌటానుమానాలు వచ్చేలా చూపిస్తున్నారు. అయితే ఎప్పుడైతే కథలోకి సూరజ్ అనే కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చాడో.. అప్పటి నుంచి కార్తీక్ పాత్రకి ప్రాధాన్యత తగ్గింది. నిజానికి కార్తీకదీపం కథ అంటేనే కార్తీక్. దీప నిలబడాలన్నా.. ఆమెను నిలబెట్టాలన్నా కార్తీక్‌నే. కానీ.. ఎప్పుడైతే కథలోకి సూరజ్ వచ్చాడో.. అతను హీరో అయిపోయాడు. ఏళ్లకి ఏళ్లు కార్తీకదీపం కథను నడిపించిన కార్తీక్‌ని కామెడీ పీస్‌ని చేశారు. హీరో ఎలివేషన్లు అన్నీ సూరజ్‌కి పడుతుంటే.. సిల్లీ జోక్‌లు అన్నీ కార్తీక్‌కి పెట్టి కమెడియన్ని చేశారు. యాక్టింగ్ పరంగా తనకి ఏ పాత్ర ఇచ్చినా కూడా కార్తీక్ చితక్కొడతాడు. అందులో సందేహం లేదు. ఇఫ్పుడు జరగుతున్న కథనంలో కూడా కథానాయకుడిగా కార్తీక్ అద్భుతంగా నటిస్తున్నాడు ఓకే. కానీ.. కథలోకి మరో క్యారెక్టర్ని తీసుకొచ్చి.. అతన్ని హీరోని చేయడంతో కార్తీక్ జీరోగా మారిపోయాడు. దీంతో నెటిజన్లు ఓ రేంజ్లో రియాక్ట్ అవుతూ.. మొదటి నుంచి ఈ కార్తీకదీపం కథలో ఉన్న లూప్స్ని బయటకు లాగుతున్నారు. ఒక్కో నెటిజన్ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. మొదటి నుంచి కథని డెప్త్‌గా ఫాలో అయిన నెటిజన్లు అడిగే ప్రశ్నలకు నో సమధానమ్స్ అనేట్టుగానే ఉన్నాయి. 🔹 ఐదో తరగతి చదువుకున్న దీప ముందు.. ముక్కు మొహం తెలియని సూరజ్ ముందు "కార్తీక్" విదేశాల చదువు ఎందుకు పనికిరాకుండా పోయిందిగా.. 🔹వడ్డించే వాళ్లు మన వాళ్లు అయినపుడు ఆఖరు వరుసలో కూర్చున్న అన్ని అందుతాయి.. అన్నట్లు దీప ఏమి చేయకుండా నిలబడి ఉన్న అన్ని అవకాశాలు వచ్చి పడతాయి. 🔹5th క్లాస్ చదివిన దాన్ని సీఈఓ చేశారు అంటే.. ఒక్క సీఈఓకి వున్నా వ్యాలువ్ని గౌరవంని కించపరిచే విధంగా చేశారు, చదువుకున్న వారి పరువు తీసినట్టే కదా? 🔹కార్తీక్ అప్పుడెప్పుడో ఒక “సంవత్సరం” వెనుక దీప ని “వారసురాలుగా” చేస్తాను అని ఛాలెంజ్ చేశాడు. కానీ ఇంకా ఏమి పీకలేక కామెడీ చేస్తున్నాడు ఏమంటారు ఫ్రెండ్స్. 🔹శివనారాయణ గారు ఈ విషయంలో చేసింది మాత్రం కరెక్ట్ అనిపించడం లేదు. కార్తీక్ దీప లని, శ్రీధర్ కావేరి లని క్షమించినట్టు దాసు కళ్యాణి లని కూడా క్షమించవచ్చు కదా. దాసు నీ బయటకి పంపించేశారు. పారు నుండి దాసు నీ దూరం చేసినట్టే కదా. శివనారాయణ చేసిన పని వల్ల ఒక తల్లి కొడుకు కూడా దూరం అయ్యారు. ఒక కోడలు తన అత్త గారి కుటుంబానికి దూరం అయింది. 🔹మొదట్లో జ్యోత్స్న మంచిదే.. ఈ దీప వల్లనే జ్యోత్స్న చెడ్డదిగా మారింది. మొదట కార్తీక్‌ని పెళ్లి చేసుకుంది. తర్వాత పదవి తీసుకుంది. నెక్స్ట్ తలితండ్రులు, ఆస్తిని తీసుకుంటుంది. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే జ్యోత్న్న.. దీపని చంపేసినా తప్పులేదు. కన్న కూతురు మాత్రమే ముఖ్యం అయితే శౌర్యని నరసింహ దగ్గరికి పంపించి అప్పుడు జ్యోత్న్సని సుమిత్ర, దశరథ్‌లకు దూరంగా పంపించాలి. 🔹అందరూ సుమిత్ర దశరథ్ గార్లకి దీప దూరం అయింది అని ఆలోచించేవారే కానీ ఒక్కరోజు అయిన కళ్యాణి గారి గురించి ఆలోచించారా. తనకి కూడా తన కూతురు జ్యోత్స్న దూరం అయింది. జ్యోత్స్న కళ్యాణి గారి దగ్గరే ఉండి ఉంటే జ్యోత్స్న తలరాత ఇంకోలా ఉండేది. ఇలా యువరాణి లా ఉంటూ కూడా రోజు తిట్లు తినడం కంటే పనిమనిషి గా గౌరవం గా బ్రతకడం ఎంతో మేలు అని జ్యోత్స్న చెప్పింది. అది నిజం. ఒకవేళ పారు బిడ్డల్ని మార్చకపోయి ఉంటే జ్యోత్స్న ఈ రోజు చదువుకుని గొప్ప ఉద్యోగం చేస్తూ సంతోషంగా ఉండేదేమో. బిడ్డల్ని మార్చడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది జ్యోత్స్న కి. నిజం తెలియదు కాబట్టి బిడ్డ నీ పోగొట్టుకున్న బాధ సుమిత్ర గారు అసలు అనుభవించలేదు కానీ కళ్యాణి గారు బిడ్డ ని పోగొట్టుకున్న దుఃఖం జీవితాంతం అనుభవించారు.