
తిరుమల: ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) తితిదేకి భారీగా విరాళాలు ప్రకటించారు. తితిదేకు 25 ఎలక్ట్రిక్ బస్సులు విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. 50 మంది
బస్సు డ్రైవర్ల జీతభత్యాలు కూడా చెల్లించడంతో పాటు, తిరుమలలో ఛార్జింగ్ స్టేషన్ను రిలయన్స్ ఏర్పాటు చేయనుంది. గుజరాత్ వంతారాలో ఉన్నట్టుగా తితిదే గోశాలను ఆధునికీకరణకు అంగీకారం తెలిపారు. ఇవాళ వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో అనంత్ అంబానీ పాల్గొన్నారు. అంతకముందు తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలో మూలవిరాట్టును దర్శించుకున్న అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.