
బారా షహీద్ దర్గాలో శనివారం అర్థరాత్రి ఘనంగా గంధ మహోత్సవం ప్రారంభమైంది. నగరంలోని కోటమిట్ట అమీనియా మసీదు నుంచి 12 పాత్రలలో గంధాన్ని పూల రథంలో మేళ తాళాలతో ఊరేగింపుగా దర్గాకు తీసుకువచ్చారు.
నెల్లూరు, జూన్ 28: బారా షహీద్ దర్గాలో శనివారం అర్థరాత్రి ఘనంగా గంధ మహోత్సవం ప్రారంభమైంది. నగరంలోని కోటమిట్ట అమీనియా మసీదు నుంచి 12 పాత్రలలో గంధాన్ని పూల రథంలో మేళ తాళాలతో ఊరేగింపుగా దర్గాకు తీసుకువచ్చారు. ఆదివారం తెల్లవారుజామున ఈ మహోత్సవాన్ని కడప దర్గా పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా అమీనుల్లా హుస్సేనీ సాహెబ్ నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆ గంధాన్ని పంచిపెట్టారు. ఈ గంధాన్ని పంచే ముందు ‘బారా షహీద్’లకు ఈ గంధాన్ని పూస్తారు. ఈ గంధ మహోత్సవంలో పాల్గొనేందుకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు బారా షహీద్ దర్గాకు తరలి వచ్చారు.
ఈ రొట్టెల పండుగ సందర్బంగా ఉద్యోగం, గృహవసతి, వివాహానికి సంబంధించిన రొట్టెలకు భారీగా డిమాండ్ పెరిగింది. స్వర్ణాల చెరువు వద్ద ఈ ప్రత్యేక రొట్టెల కోసం భక్తులు ఆరా తీస్తున్నారు. ఈ పండుగకు హాజరయ్యే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. ఈ రొట్టెల పండగ కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. దీంతో నాటి నుంచి ప్రతి ఏటా భక్తుల సంఖ్య అంత కంతకు పెరుగుతోంది. ఈ ఏడాది ఈ పండగకు దాదాపు 20 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.
డ్రై ఫ్రూట్స్‌కు పురుగులు పడుతున్నాయా? ఇవిగో సింపుల్ చిట్కాలు..
బంగాళదుంపలు ఉడికించిన నీటిని పారబోస్తున్నారా?