
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అధికార యంత్రాంగంతో కలిసి తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి క్యూలైన్లను శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
జూన్ నెలలో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు చెప్పారు. ‘‘ రోజుకు 80 వేల మందికిపైగా దర్శనాలు చేయిస్తున్నాం. ఇవాళ లక్షన్నర మందికిపైగా దర్శనానికి వచ్చి వేచి ఉన్నారు. ఆదివారం కూడా రద్దీ కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు సోమవారం నాటి శ్రీవాణి కరెంట్ బుకింగ్ టికెట్లు, వీఐపీ సిఫార్సు లేఖలపై ఇచ్చే దర్శనాలు రద్దు చేశాం. భక్తులకు సేవలందిస్తూ భద్రతను పర్యవేక్షిస్తున్నాం’’ అని వెంకయ్య చౌదరి తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తోంది విజయవాడకు చెందిన షణ్ముఖ నందిని.
కర్ణాటక స్టేట్ షూటింగ్ ఛాంపియన్ షిప్లో తెలుగు బాలుడు సత్తా చాటాడు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శనివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది.
వారాంతపు సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.
ఆంధ్రుల ఎన్నో ఏళ్ల కల.. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం.
కృష్ణాజిల్లా పామర్రులో భారీ వర్షం కురుస్తోంది.
ఆయన ఓ అథ్లెట్. చిన్నప్పటి నుంచి కష్టం విలువ తెలిసిన మనిషి. అందుకే వెన్నుపూస గాయంతో కదల్లేని స్థితికి చేరినా పట్టుదలను వీడలేదు. సాహసమే శ్వాసగా మళ్లీ పరుగు తీశారు.