
ఇంటర్నెట్ డెస్క్: మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) సీషెల్స్కు వెళ్లారు. పర్యటనలో భాగంగా ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవి ‘జొనాథన్’ను కలవనున్నారు.
సీషెల్స్ (Seychelles) నేషనల్ బొటానికల్ గార్డెన్లో ఉన్న జొనాథన్ (Jonathan) అనే తాబేలు వయసు 194 ఏళ్లు. ఈ తాబేలును సందర్శించిన అనంతరం మోదీ బొటానికల్ గార్డెన్లో మొక్కను నాటనున్నారు. సీషెల్స్ జాతీయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి మోదీని గౌరవ అతిథిగా ఆహ్వానించారు. భారత్-సీషెల్స్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్కడ స్మారకోత్సవాలు సైతం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మోదీ ఆ దేశ పర్యటనకు వెళ్లారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. ‘జొనాథన్’ (Jonathan) ప్రపంచంలోనే అత్యంత వృద్ధ తాబేలు. 1832లో జన్మించింది. ఈ తాబేలుకు 50 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 1882లో సెయింట్ హెలెనా ద్వీపానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అది సీషెల్స్ నేషనల్ బొటానికల్ గార్డెన్లో ఉంటోంది. 194 ఏళ్ల వయసులోనూ జొనాథన్ మంచి ఆరోగ్యంతో ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు. ఇదీ చదవండి: భారత పర్యటనకు ట్రంప్.. త్వరలో ఖరారు కానున్న ట్రేడ్ డీల్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.