
సాధారణంగా ముఖం, మెడ, చేతులు, జుట్టు.. వీటి గురించి పట్టించుకున్నంతగా పాదాల గురించి పట్టించుకోం. అందుకే ట్యాన్ పేరుకుపోయి అవి నల్లగా కనిపిస్తుంటాయి. అలా కాకుండా పాదాలు కూడా చక్కటి ఛాయతో మెరవాలంటే..
కొన్ని సహజసిద్ధమైన ప్యాక్‌లను ఉపయోగించాలంటున్నారు నిపుణులు.
సాధారణంగా ముఖం, మెడ, చేతులు, జుట్టు.. వీటి గురించి పట్టించుకున్నంతగా పాదాల గురించి పట్టించుకోం. అందుకే ట్యాన్ పేరుకుపోయి అవి నల్లగా కనిపిస్తుంటాయి. అలా కాకుండా పాదాలు కూడా చక్కటి ఛాయతో మెరవాలంటే.. కొన్ని సహజసిద్ధమైన ప్యాక్‌లను ఉపయోగించాలంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందామా..
పెరుగు ఆరోగ్యాన్ని కాపాడటానికే కాదు.. అందాన్ని సంరక్షించడానికీ ఉపయోగపడుతుంది. అయితే దీన్ని ఎక్కువగా శిరోజ సంరక్షణలోనూ, ఫేస్ప్యాక్స్లోనూ ఉపయోగిస్తారు. కానీ దీనిలో ట్యాన్‌ను తొలగించే గుణాలు కూడా ఉన్నాయట. కొద్దిగా పెరుగు తీసుకొని దాన్ని పాదాలకు రాసుకోవాలి. 20 నిమిషాల నుంచి అరగంట పాటు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొంటే చక్కటి ఫలితం కనిపిస్తుందంటున్నారు నిపుణులు.
పాదాలపై ఏర్పడిన ట్యాన్‌ను నిమ్మరసం తొలగించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. దీనికోసం కొద్దిగా నిమ్మరసం తీసుకొని దానిలో సరిపడా పంచదారను కలిపి మిశ్రమంగా తయారుచేయాలి. ఇది స్క్రబ్‌లా పనిచేస్తుంది. దీంతో పాదాలను కాసేపు మర్దన చేస్తే సరిపోతుందట.
టొమాటో ముక్కతో పాదాలపై కాసేపు రుద్దుకొని.. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమంగా చేయడం వల్ల ట్యాన్ తొలిగే అవకాశం ఉందంటున్నారు. అలాగే టొమాటో రసంలో కొద్దిగా చక్కెరను కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. దీంతో కాసేపు మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత అరగంట సమయం ఆరనిచ్చి చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే.. పాదాలు అందంగా తయారవుతాయంటున్నారు నిపుణులు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.